ప్రధానమంత్రిని విమర్శించే స్థాయి ఎమ్మెల్యేకు లేదు..

మాదారం గ్రామంలో బిజెపి జెండా ఆవిష్కరణ.
– విలేకర్ల సమావేశంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి దూళ్ల పరుశరాములు.
ఊరుకొండ, సెప్టెంబర్ 20 (జనంసాక్షి):
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీని విమర్శించే స్థాయి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి లేదని బిజెపి మండల ప్రధాన కార్యదర్శి దూళ్ల పరుశరాములు మండిపడ్డారు. మంగళవారం ఊరుకొండ మండల పరిధిలోని మాదారం గ్రామంలో బిజెపి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి జడ్చర్ల నియోజకవర్గ నాయకురాలు బాల త్రిపుర సుందరి దేవి మరియు జిల్లా ఓబీసీ అధ్యక్షులు వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్, నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ సెక్రెటరీ కృష్ణ గౌడ్ లు ముఖ్య అతిధులుగా హాజరై బిజెపి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి దూల్ల పరశురాములు మాట్లాడుతూ.. మాజీ ఆరోగ్యశాఖ మంత్రిగా, జడ్చర్ల ఎమ్మెల్యేగా కేంద్ర నిధులు లేకుండా టిఆర్ఎస్ పార్టీ ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రేవల్లి గ్రామంలో 25 మంది కుటుంబాలకు సిలిండర్లు, ఫసల్ బీమా యోజన కింద కేవలం రేవల్లి గ్రామానికి 6 కోట్లు మంజూరు చేయించిన ఘనత బిజెపికే దక్కుతుందని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా రేవల్లి గ్రామానికి చేసిన అభివృద్ధి ఏమిటో బహిరంగ చర్చకు వచ్చి తెలుసుకోవాలని సవాల్ విసిరారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తే చెక్ పవర్ రద్దు చేయించి సర్పంచిని దోషిగా నిలబెట్టిన బీజేపీ పార్టీ గురించి విమర్శించే హక్కు ఎమ్మెల్యేకి లేదన్నారు. కేంద్ర నిధులు లేకుండా సర్పంచ్, జడ్పిటిసి రేవల్లి గ్రామానికి చేసిన అభివృద్ధి ఏమిటో చూపాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో బిజేపి మండల అధ్యక్షులు ఆంజనేయులు, మండలజనరల్ సెక్రెటరీ రాజేందర్ గౌడ్, పరుశరాములు, వెంకటేష్, ఆనంద్, మాదారం గ్రామ బూతు అధ్యక్షులు రవీందర్, లక్ష్మణ్, నాగరాజు, మహేష్, మరియు మాదారం గ్రామ బిజెపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.