ప్రపంచకప్‌ మేం నిర్వహించలేం..

ఐసీసీకి ఊహించని షాక్‌ ఇచ్చిన జైషా
న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): మహిళల టీ20 ప్రపంచకప్‌ బంగ్లాదేశ్‌లో జరగనుంది. అయితే, ప్రస్తుతం బంగ్లాతో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. దీంతో బంగ్లా ఆతిథ్యంపై ప్రశ్నలు మొదలయ్యాయి. దీనిపై ప్రస్తుతానికి ఐసీసీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఈ ఐసీసీ ఈవెంట్‌ బంగ్లా నుంచి తరలొచ్చని అంటున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జైషా కీలక స్టేట్‌మెంట్‌ చేశాడు. బీసీసీఐ కార్యదర్శి జయ్‌ షా ప్రకారం, మహిళల టీ20 ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఈ ఐసీసీ ఈవెంట్‌ను చేపట్టేందుకు భారత్‌ నిరాకరించింది. బంగ్లాదేశ్‌లో ఈ టోర్నీ అక్టోబర్‌లో టోర్నీ జరగనుంది. విద్యార్థుల నిరసనల కారణంగా ప్రధాని షేక్‌ హసీనా దేశం విడిచి వెళ్లవలసి వచ్చింది. ఇది తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు దారితీసింది.బంగ్లాదేశ్‌లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులు మహిళల %ు%20 ప్రపంచకప్‌నకు ఆతిథ్యమివ్వగల అవకాశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రాజకీయ అస్థిరత కారణంగా మరో దేశం ముందుకు రావచ్చని ఊహాగానాలు వచ్చాయి. భారతదేశం, శ్రీలంక, %ఖAజు% సాధ్యమైన ఎంపికలుగా పరిగణిస్తున్నారు.టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జై షా భారత్‌ నిర్ణయం గురించి చెప్పుకొచ్చాడు. మహిళల టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించాలన్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అభ్యర్థనను తిరస్కరించామని తెలిపాడు. వచ్చే ఏడాది మహిళల వన్డే ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్‌ ఇప్పటికే సిద్ధంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూ తెలిపాడు.