ప్రపంచ మొదటి ఆయుర్వేద వైద్యుడు నాయి బ్రాహ్మణుడే :

నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు మంగలి ప్రకాష్ నాయి
పరిగి, రూరల్  అక్టోబర్​ 23( జనం సాక్షి ):
ప్రపంచ మొదటి ఆయుర్వేద వైద్యుడు ధన్వంతరీ నారాయణుడు అని  నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు మంగలి ప్రకాష్ నాయి అన్నారు. అక్టోబర్ 23న నాయి బ్రాహ్మణ కుల దైవం అయినటువంటి ధన్వంతరీ నారాయణుడి జయంతి సందర్భంగా  ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం పురస్కరించుకుని, ధన్వంతరీ నారాయణుడికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం మంగలి వల్ల సొంతం అన్నారు.ప్రతి యేటా ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. పూర్వ కాలం నుండి నాయి బ్రాహ్మనులు ఆయుర్వేద వైద్యం ను అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వము ఆయుర్వేద వైద్యం లో ప్రత్యేక కోర్సును ప్రవేశ పెట్టీ, సర్టిఫికెట్లను అందజేసి ప్రభుత్వమే ఉద్యోగ అవకాశాలు కలించాలని ప్రభుత్వాన్ని విజ్ఞాప్తి చేశారు. కుల ఐక్యతే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కేటాయించిన ఆత్మగౌరవ పత్రలను నాయుబ్రాహ్మములకు అందజేసి  ప్రభుత్వమే ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించి ఇవ్వాలని సిఎం కేసిఆర్ ను, బిసి సంక్షేమ శాఖ మంత్రి నీ ఈ సందర్భంగా కోరారు.