ప్రభుత్వం ఎస్సీ కార్పోరేషన్ ద్వారా గిరిజనుల ధర్నా
మల్లాపూర్ : ప్రభుత్వం ఎస్సీ కార్పోరేషన్ ద్వారా గిరిజనులకు కేటాయించిన సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయడంతో జాప్యాన్ని నిరసిస్తూ గిరిజనులు తాహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దారు జయరాజ్‌కు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ తెగల సంక్షేమ సంఘం అధ్యక్షులు బూక్యా గోవింద్ నాయక్ బూక్యా శ్రీనివాస్ ,ఇట్లావత్ బలరాంలతో పాటు 200 మంది గిరిజనులు పాల్గోన్నారు.