ప్రభుత్వ ఆసుపత్రిలో సారిశుధ్యం
మంచిర్యాల,మే29(జనం సాక్షి): మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణలో శ్రద్ద తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి ఆదేశాలతో అధికారులు కదిలారు. ప్రధానంగా పారిశుద్యం పై చర్యలకు ఉపక్రమించారు. పారిశుద్ధ్య చర్యలపై నిర్లక్ష్యం వీడాలన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నెలకొన్న అపరిశుభ్రతపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో ఎక్కువ మంది ఉండటం.. పారిశుద్ధ్య లోపంతో ఆసుపత్రి ఆవరణ అస్తవ్యస్తంగా మారడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలో చేరిన రోగులకు సహాయకులుగా ఒక్కరిని మాత్రమే అనుమతించాలని అన్నారు.ఆసుపత్రిలోని రోగులు, వారి బంధువులతో మాట్లాడారు. అనంతరం వార్డులు, ఐసీయూ గది, ప్రసూతి చికిత్స గదులు, కేసీఆర్ కిట్లను ఆయన పరిశీలించారు.ఆస్పత్రిలో పారిశుద్యంపై చర్యలకు ఉపక్రమించారు. ఎక్కడా దుర్గంధం చెత్త కానరాకుండా చూడాలని ఆదేశించారు. దీంతో రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే ర్యావరణ పరిరక్షణకు నాటిన మొక్కలను సంరక్షించాలని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి మొక్కలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.