ప్రభుత్వ ఉద్యోగుల బ్యాడ్మింటన్ పోటీలు.
ఫోటో రైటప్: విజేతగా నిలిచిన తాండూరు సిఐ జట్టు.
బెల్లంపల్లి, ఆగస్టు16, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే ఇనిస్టిట్యూట్లో బుధవారం ఆజాది కా అమృత్ మహోత్సవ్ సంబరాల్లో భాగంగా బెల్లంపల్లి రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉద్యోగుల బ్యాడ్మింటన్ పోటీలను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఏసీపీ ఎడ్ల మహేష్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ ఆటల పోటీల వల్ల శారీరక దృఢత్వం కలగడమే కాకుండా మానసిక ప్రశాంతత పొందుతారన్నారు. ఉద్యోగులు విధి నిర్వహణలో తలమునకలై ఉండి, అప్పుడప్పుడు ఇలాంటి పోటీల వల్ల ఉత్తేజం పొందుతారన్నారు.ఈ టోర్నమెంట్ లో వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల జట్లు పాల్గొనగా కె జగదీష్, తాండూరు సిఐ, సంతోష్ గౌడ్ హెడ్ కానిస్టేబుల్ తాండూరు జట్టు విజేతగా నిలిచింది. రన్నర్స్ గా సమ్మయ్య హెడ్ కానిస్టేబుల్ ఏఆర్ బెల్లంపల్లి, రాజశేఖర్ శానిటరీ ఇన్స్పెక్టర్ బెల్లంపల్లి మున్సిపాలిటీ జట్టు నిలిచింది. ఈ రెండు జట్లు రేపు జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే నియోజకవర్గ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పాల్గొంటాయని టోర్నమెంట్ నిర్వాహకుడు బెల్లంపల్లి రూరల్ సిఐ బాబురావు తెలిపారు. ఈకార్యక్రమంలో బ్యాడ్మింటన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సుధాకర్, పిఇటి రాజేష్, బాబురావు, పళ్లెం రాజలింగు, సీనియర్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొన్నారు.