ప్రభుత్వ క్రీడ మైదానంలో పూల పండుగ .. బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత,
ధర్మపురి ప్రభుత్వ క్రీడా మైదానంలో బతుకమ్మ పండుగ వేడుకలు ఆనందోత్సాహల మధ్య జరిగాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం బతుకమ్మ పండగ వేడుకల్లో పాల్గొన్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని చాటి చెప్పే పండుగ బతుకమ్మ.బతుకులు చల్లంగా ఉండాలని కోరుతూ ఆడపడుచులు,మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మగా పేర్చి సంబురాలు చేసుకుంటున్నారు.తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పూల పండుగలో ఐదవ,రోజు ముద్దపప్పు బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు అధికార పార్టీకి చెందిన మహిళా నేతలు. ముందుగా కల్వకుంట్ల కవిత ధర్మపురి నంది చౌకులోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు.కల్వకుంట్ల కవితతో పాటు మహిళా ప్రజాప్రతినిధులు, తెలంగాణ ఆడపడుచులు ఈ ముద్దపప్పు బతుకమ్మ సంబురాల్లో భాగస్వాములయ్యారు. తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడే విధంగా బతుకమ్మ పాటలు పాడుతూ పాటలకు తగినట్లుగా ఆడారు.బతుకమ్మ పండుగ ఐదవ, రోజు ముద్దపప్పు బతుకమ్మ సందర్భంగా ముద్దపప్పు,పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసారు.టీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో బతుకమ్మ సంబురాలను ప్రభుత్వ క్రీడా మైదానంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని కవిత మీడియాకు తెలుపుతూ,పూలను పూజించే గొప్ప పండుగ తెలంగాణలోనే జరుగుతుంది. తెలంగాణ అస్తిత్వ ప్రతీక బతుకమ్మ,ఆడపడుచుల ఆత్మగౌరవ పతాక.సాధికారిక తెలంగాణలో బంగారు బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి.ఊరూరావాడ వాడల్లో,పట్టణాలు, నగరాల్లో ఓవైపు శరన్నవరాత్రి ఉత్సవాలు ..మరోవైపు బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయని కల్వకుంట్ల కవిత అన్నారు.కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి,ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు,జెడ్పిటిసి బత్తిని అరుణ,మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సతేమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్, మరియు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు రైతులు తదితరులు పాల్గొన్నారు.