ప్రభుత్వ భూములను కాపాడుకునే ధైర్యం చేయలేని నిస్సహాయ స్థితిలో అధికార యంత్రాంగం: రేవూరి
జనం సాక్షి:నర్సంపేట
నర్సంపేట పట్టణంలో భూకబ్జాలు, సెటిల్మెంట్లలో టీఆర్ఎస్ నేతలు ఆరితేరారని ప్రభుత్వ భూములుగా ధరణిలో నమోదై ఉన్నప్పటికీ ఆ భూమిని కాపాడుకునే ధైర్యం చేయలేని నిస్సహాయ స్థితిలో అధికార యంత్రాంగం ఉందని బీజేపి రాష్ట్ర నాయకులు మాజీ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.
నర్సంపేట పట్టణంలో అక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల పరిరక్షణకై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు,మాజీ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి బిజెపి నేతలతో కలిసి సోమవారం నర్సంపేట లోని ఆర్ అండ్ బి అతిథి గృహం ముందు ‘దీక్ష” నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కొంత మంది అధికారులు టీఆర్ఎస్ నాయకులకు ఆనుకూలంగా వవ్యవహరిస్తున్నారని ఐఏఎస్, ఐపీఎస్ అధికార పార్టీ నేతలకు భజన చేయడం కాళ్లు మొక్కడం సరి కాదని రాజకీయ వ్యవస్థ ఒత్తిళ్లకు అధికారులు లొంగొద్దని కోరారు.నర్సంపేట పట్టణంలో ఎక్కడ చూసిన భూకబ్జాలు, సెటిల్మెంట్ దందాలలో అధికార టీఆర్ఎస్ నేతలే కనిపిస్తున్నారని ప్రభుత్వ భూములకు కంచెలు ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం కావడంతో ఎక్కడ ప్రభుత్వ స్థలం కనపడితే చాలు అధికార పార్టీకి చెందిన నేతలు కబ్జా చేస్తున్నారని ఆధారాలున్నా ప్రభుత్వ భూమి అని వెబ్ సైట్‌లో దర్శనం ఇస్తున్నా కనీసం ఆ భూమిని కాపాడే ధైర్యం ఏ అధికారీ చేయకపోవడం శోచనీయమని రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.నర్సంపేటలోని జాలుబంధం కాల్వకు బౌండరీలు ఏర్పాటు చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
అధికారులకు ఆదేశాలివ్వాలని, ,అసైన్డు భూమల్లోని అక్రమ లేఔట్లను వెలికితీయాలని రేవూరి ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే సామాన్యులు రాబోయే రోజులలో నష్టపోయే ఛాన్స్ ఉందని అన్నారు.నిజాయితీగా పనిచేసే అధికారులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని నర్సంపేటలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుండి తాను పోటీ చేస్తానని నర్సంపేట నియోజకవర్గం లో ఇప్పటికీ శాసనసభ్యులుగా తాను చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తున్నదని నర్సంపేటలో తనకన్నా వంద రూపాయల ఎక్కువ అభివృద్ది చేసినా ఓటు అడగనని అభివృద్ది చేసిన వారికే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని తనకు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని వచ్చే ఎన్నికల్లో తాను శాసనసభ్యుడిగా గెలవడం ఖాయమని ఆయన అన్నారు.
ఇప్పటికైనా 3 నెలల్లో నర్సంపేట ప్రాంతంలోని ప్రభుత్వ భూములకు బౌండరీలు ఫిక్స్ చేయాలని లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పలుగు, పార పట్టి తామే బౌండరీలు వేసి ప్రభుత్వ భూములను కాపాడుతామని హెచ్చరించారు.
Attachments area