ప్రమాదానికి గురైన అజ్మీర్‌ యాత్రకు వెళుతున్న బస్సు

ఒక మహిళ మృతి: ఇద్దరికి తీవ్ర గాయాలు

మంచిర్యాల,జూన్‌21(జ‌నం సాక్షి): అజ్మీర్‌ యాత్రకు వెళ్లే బస్సు రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన మంచిర్యాల జిల్లాలోని తాడూరులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఎనిమిది మంది యాత్రికుల బృందంతో వెళుతున్నబస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, మరోఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని తాడూరు నుంచి అజ్మీర్‌ యాత్రకు బస్సు బయలుదేరింది. 8 మంది యాత్రికుల బృందంతో వెళుతున్న బస్సును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.