ప్రయాణికులకు మరింత చేరువ గా ఆర్టీసీ
టి 9 పేరట సీజన్ టికెట్లు.రోజుకు వంద రూపాయలు తో 60 కిలోమీటర్ల అపరిమిత ప్రయాణం.టి.ఎస్.ఆర్టిసి. డిప్యూటీ ఆర్. ఎం. శివశంకర్.
మిర్యాలగూడ, జనం సాక్షి.ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు టి ఎస్ ఆర్ టి సి కృషి చేస్తుందని టి ఎస్ ఆర్ టి సి నల్గొండ డిప్యూటీఆర్ ఎం శివశంకర్ అన్నారు. గురువారం మిర్యాలగూడ బస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రయాణికుల సౌకర్యం కొరకు ప్రవేశపెట్టిన” టీ 9 ” టికెట్స్ సౌలభ్యాన్ని ప్రయాణికులకు వివరిస్తూ ప్రయాణికులు 60 కిలోమీటర్ల ప్రయాణం చేసే వారు కేవలం 100 రూపాయలు చెల్లించి అప్ అండ్ డౌన్ ప్రయాణించే సౌకర్యం గతంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్యలో ప్రయాణించే సౌకర్యము కల్పించామని, ఆ సౌకర్యాన్ని ప్రయాణికుల అభ్యర్థన మేరకు వారు ప్రయాణించే సమయాన్ని ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు ప్రయాణించే విధంగా మార్పులు చేశామని పేర్కొన్నారు. మిర్యాలగూడ డిపో గత నెల 18 నుండి నేటి వరకు 1800″ T 9 ” టికెట్స్ అమ్మడం జరిగింది.గురువారం హైమా అనే మహిళా కండక్టర్ ఎక్కువ టి 9 టికెట్స్ గూర్చి తన బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్టీసీ వాళ్ళు కల్పిస్తున్న సౌకర్యాన్ని వినియోగించుకొని మీ యొక్క డబ్బును ఆదా చేసుకోగలరని వివరిస్తూ ఎక్కువ టి 9 టికెట్స్ అమ్మిన జాబితాలో ఉన్నందున ఈ కార్యక్రమం లో మిర్యాలగూడ డిపో సందర్శించిన డిప్యూటీ ఆర్ ఎం చేతుల మీదుగా డి ఎం, సి ఐ ల సమక్షంలో ఆమెను శాలువాతో సన్మానించి, ఇదే రీతిలో ప్రతి ఒక్క కండక్టరు టీ 9 టికెట్స్ ని ఎక్కువగా అమ్ముటకు ప్రయత్నించాలని డిప్యూటీ ఆర్ ఎం శివ శంకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డిపో మేనేజర్ బి. పాల్, సి ఐ. సంధ్యా రాణి,ఫోర్మెన్ యాదగిరి,తదితరులు పాల్గొన్నారు.