ప్రశాంతంగా ఉప ఎన్నిక పోలింగ్
శ్రీకాకుళం, జూన్ 12 : జిల్లాలోని నరసన్నపేట శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరారు. ఒకరి తర్వాత ఒకరిగా తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఉదయం 9 గంటల సమయానికి 10 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రస్తుతం పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది.