ప్రాణహిత- చెవెళ్ల డిజైన్ మారుస్తాం
– గుడుంబాకు ప్రత్యామ్నాయంగానే చీప్‌లిక్కర్
– రాద్ధాంతం మానండి
– గోదావరి నదిపై మహారాష్ట్ర 200 అక్రమ ప్రాజెక్టులు
– అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ
– సీఎం కేసీఆర్
కరీంనగర్,ఆగస్ట్25(జనంసాక్షి):
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ మార్చి తీరుతామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. దీనిపై అనవసర రాద్దాతం, విమర్శలు మానుకోవాలని ఆయన విపక్షాలకు హితవు పలికారు. కాళేశ్వరం వద్ద నుంచి నిర్మించడం వల్ల 200 టిఎంసిల నీరు రానుందని, నీటి లభ్యతను ఆధారం చేసుకుని మార్చాలని నిర్ణయించామని, అందులో వెనక్కి తగ్గేది లేదన్నారు. కరీంనగర్ పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్ ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ అవసరాలు, అభివృద్దికి అనుగుణంగా ప్రాజెక్టులను చేపడతామని స్పష్టం చేశారు. నీళ్లు రావాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల అససమర్థత వల్ల తెలంగాణకు జరిగిన నష్టాన్ని ప్రజల ముందు పెడతామన్నారు. రాష్ట్రంలో నీటి పారుదలపై కొత్త విధానం తీసుకొస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రాజెక్టుల వల్ల కలిగిన నష్టాన్ని, కావాలని చేసిన ద్రోహాన్ని ప్రజల ముందుంచుతామని అన్నారు. వచ్చే శాసనసభ సమావేశాలకు ముందే ప్రజలకు వివరాలు అందజేస్తామని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రుల అసమర్థత వల్ల జరిగిన నష్టాన్ని ప్రజల ముందు పెడుతామన్నారు. ప్రాజెక్టులను ప్రతిపాదించడమే మన పనని, నీరు ఎలా రావాలి, ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించాలన్నది నిపుణులు సూచిస్తారని అన్నారు. రాజకీయ నాయకులు ఈ పని చేయలేరని అన్నారు. బ్యారేజీలు ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, కాలువ ఎక్కడ తవ్వాలి అని నిపుణులు చెబుతారని.. రాజకీయ నేతలు కాదని అన్నారు. ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. విమర్శలు చేస్తే గొప్పవాళ్లం అవుతామన్న ధోరణి సరికాదని హితవు పలికారు. విపక్షాలు రాద్దాంతం మాని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. బాబ్లీ కోసం ఎందుకు రాజీకయం చేశారో చెబితే ఆశ్చర్యపోతారని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల విషయంలో గత ఆంధ్రా సిఎంలు ఎప్పుడూ సానుకూలతతో ఆలోచించ లేదన్నారు. అయితే అంతర్‌రాస్ట వివాదాలు లేకుంటే మరో వివాదంతో ప్రాజెక్టులు ముందుకు కదలకుండా చేశారని మండిపడ్డారు. అందుకే ఒక్కో ప్రాజెక్టులో ఏం జరిగిందో ప్రజల ముందు పెడుతామన్నారు. రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు కోసం రూ. 800 కోట్లు ఖర్చు చేశారు. కేవలం పైపుల కోసమే రూ. 700 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ 30- 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇస్తామని ఎన్నికల్లో చెప్పాం. బాబ్లీ విషయంలో టీడీపీ ఆడిన డ్రామాలు అందరికీ తెలుసు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో మహారాష్ట్ర సర్కార్ గోదావరి, దాని ఉపనదులపై 200 ప్రాజెక్టులు కట్టింది. మహారాష్ట్ర సర్కార్ అన్ని ప్రాజెక్టులు కడుతుంటే ఒక్క నాయకుడు మాట్లాడలేదన్నారు. దానివల్లనే శ్రీరాం సాగర్ తదితర ప్రాజెక్టులకు నీరు రావడం లేదన్నారు. కరీంనగర్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు అండ్ కో బాబ్లీ నాటకం ఆడారని, మరి అంతకుముందు కట్టిన ప్రాజెక్టులపై ఎందుకు పట్టించుకోలేదన్నారు. ఇంద్రావతి, ప్రాణహితే మనకున్న నదులని, వాటి నుంచే నీరు రావాల్సి ఉందన్నారు. దుమ్ముగూడెం కోసం రూ. 800 కోట్లు ఖర్చు పెట్టారు. అయినా ఒక్క ఇంటెక్‌వెల్ లేదు.. ఒక్క పంప్‌హౌస్ లేదు. మిడ్‌మానేరును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి సాగునీరందిస్తాం. ప్రాజెక్టు అంటే కనీసం ఒక 50 టీఎంసీల నీరు ఉండాలి. దేవాదులకు ఖర్చు పెట్టింది రూ. 7 వేల 500 కోట్లు.. అతికష్టం విూద 50 రోజులు నీరందిస్తుంది. ఎవరి వాటా వాళ్లు జేబులో వేసుకున్నారు.. కానీ చుక్క నీరు రావడంలేదు. 170 రోజులు నీళ్లు అందివాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పటివరకు సగం కూడా పూర్తి కాలేదన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 14 టీఎంసీలను… దానిని 200 టీఎంసీల సామర్థ్యంతో రీడిజైన్ చేసినట్లు తెలిపారు. తెలంగాణలో రీ డిజైన్ చేయడం ద్వారా ఇప్పుడే పునాది రాళ్లు వేస్తున్నాం.. ఏ పనీ ఆదరా బాదరాగా చేయొద్దు. రాష్ట్రంలో సాగుకు అనుకూలంగా ఉన్న భూమి ఒక కోటి రెండు లక్షల ఎకరాలు. సాగుకు అనుకూలంగా ఉన్న భూమికి తప్పకుండా నీరందిస్తామని ప్రకటించారు. విూడియా సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, కెటిఆర్, ఎమ్మెల్యేలు, కలెక్టర్ నీతూప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్దికి దోహదపడేలా గ్రామజ్యోతి కార్యక్రమాన్ని చేపట్టామని ఇందులో ప్రజలందరిని భాగస్వాములను చేసి ప్రజారోగ్యం కాపాడడంతోపాటు, అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. గ్రామజ్యోతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇందులో ప్రతిఒక్కరిని భాగస్వాములను చేస్తున్నామ న్నారు. గ్రామజ్యోతి కార్యక్రమానికి ధీటుగా అంతే ప్యారలాల్‌గా పట్టణ జ్యోతి కార్యక్రమాన్ని త్వరలోనే చేపడుతామన్నారు. ఇందుకు అవసరమైన చర్యలు ఇప్పటికే మేయర్లు, కవిూషనర్లు, చైర్మన్లతో సమావేశాలు నిర్వహించామని మరోసారి సమావేశమై సెప్టెంబర్ మొదటి వారంలో పట్టణజ్యోతి కార్యక్రమన్ని చేపడుతామన్నారు. కేంద్రం ప్రకటిస్తున్న స్మార్ట్ సిటీలు, మరో పథకానికి సంబందించిన గైడ్‌లైన్స్ రావాల్సి ఉందని వాటికింద ఎన్ని నిధులు వస్తాయో చూసిన తర్వాత గ్రామజ్యోతిలాగే పట్టణజ్యోతికి అంకురార్పణ చేస్తామన్నారు. పట్టణాల్లో అక్రమలేఅవుట్లు, కట్టడాలను నియంత్రించడం రెగ్యులరైజ్ చేయడమేకాక అభివృద్ది పనులకు సంబందించిన ప్రణాళికలు సిద్దం చేస్తామన్నారు. ఇటీవల హైదరాబాద్ జీహెచ్‌ఎంసిలో స్వచ్చ హైదరాబాద్ నిర్మాణానికి ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర క్యాడర్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, తాను మంత్రులు కలిసి డివిజన్లను దత్తతతీసుకుని మహాఉద్యమంలా చేశామన్నారు. త్వరలోనే హైదరాబాద్ రూపురేఖలను మార్చేవిధంగా 21వేల కోట్లను వెచ్చించి మల్టిపుల్ ఫ్లై ఓవర్ల నిర్మాణంతోపాటు రోడ్ ఓవర్ రోడ్లను నిర్మిస్తామని, ట్రాఫిక్ ఫ్రీ గా తీర్చిదిద్దుతామన్నారు. తెలంగానాలోని ప్రతి ఇంటికి మంచినీటిని కులాయిల ద్వారా పంపిణీ చేసేందకు 35నుంచి 40వెల కోట్లను వెచ్చించనున్నామన్నారు. దీనికి సంబందించిన సవిూక్షను కూడా ఈరోజు కరీంనగర్‌లో పంచా యితీరాజ్ మంత్రి, కార్యదర్శులను పిలిపించి సవిూక్షించడం జరిగిందన్నారు. రెండేళ్లలో ఖచ్చితంగా 90శాతం గ్రామాలకు పట్టణాలకు ఇంటింటికి నీరు అందిస్తామన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం వారసత్వంగా ఇచ్చిన సమస్యలు పుష్కలంగా ఉన్నాయన్నారు. వనరులను వసతులను సింక్రోనైజ్ చేసి పల్లె నుంచి హైదరాబాద్ వరకు చేయి చేయికలిపి అభివృద్ది చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నాయకులు నేడు తెలంగాణా ప్రభుత్వం చేసే ఏపనిని కూడా స్వీకరించడంలేదని కేవలం విమర్శలకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు. ఎంపిటీసీలకు గ్రామజ్యోతిలో ప్రాధాన్యతలేదనేది వాస్తవమేనని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి విలువిస్తామన్నారు. నేడు రాష్ట్రంలో ఎన్నికలు లేవని రాజకీయాలు చేయడం తమ అభిమతం కానే కాదన్నారు. అభివృద్దికోసం ప్రతి పార్టీ కలిసిరావాలన్నారు. కేంద్రం ప్రకటించిన నిధులు కూడారాకుండా చేస్తుందని ఆయన ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం తెలంగాణాకు 3.5శాతం క్రెడిట్ రేషియో రావా ల్సి ఉండగా కేవలం 3 శాతానికి పరిమితం చేసి కేంద్రం ఒంటెద్దు పోకడలను అవలంబిస్తోందని ఆరోపించారు.
కేంద్రం ఇటీవలే ఐసీడీఎస్ పథకానికి కూడా నిధులలో కోత విధించిందని అయినా తాము మాత్రం అదేవిదంగా ఖర్చు చేస్తున్నామన్నారు. 700 కోట్లు అదనంగా భారం పడిందన్నారు. రాజీవ్ రహదారిలో మూల మలుపులు తగ్గించేందుకు ప్రణాళికలు సిద్దం చేశామని త్వరలోనే చేపడుతామన్నారు. ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అర్చకుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, దీనిని రమణాచారి చూస్తున్నారన్నారు. తెలంగాణాలో కరువు పరిస్థితులపై సెప్టెంబర్ వరకు ఆశలున్నాయని, ఆతర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి పర్యావరణ సమస్య తలెత్తుతోందన్నారు. ఇప్పటికే విభజన చట్టం ప్రకారం కరీంనగర్ రామగుండంలో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ఎన్‌టీపీసీ చేపడుతోందన్నారు. ఉత్తర తెలంగాణాలో విద్యుత్‌కు సంక్షోభం లేదని, దక్షిణ తెలంగాణాలో కూడా దిగుమతి చేసుకుంటున్న కోల్‌నుంచి దామరచర్లలో ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నామన్నారు. రామగుండంలో ఇప్పటికే 9600 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చిందని అందులోనే అదనంగా 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు విస్తరణ చేస్తుందన్నారు. అలాగే మహబూబ్‌నగర్‌లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు అంకురార్పణ చేస్తున్నామన్నారు. వీటన్నింటిని కూడా జెన్‌కోతోనే చేస్తామన్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఆర్టీసిని పరిరక్షించేందకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్టీసిని తమ ప్రభుత్వం కాపాడుతుందన్నారు.ఇతర రాస్ట్రాల్లో అర్బన్ ట్రాన్స్ పోర్టులను ఆయా నగరపాలక సంస్థలే చేస్తున్నాయన్నారు. తెలంగాణా విమోచన దినాన్ని కావాలనే రాద్దాంతం చేస్తూ బీజేపి ఆందోళనలకు దిగుతుందన్నారు. ఏపార్టీకి గౌరవం ఉన్న ఆపార్టీ కార్యాలయాల్లో చేసుకుందామన్నారు. దీనిపై ముస్లింలకు నష్టం జరిగిందనే భావన ఉందన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కొందరు నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, కొన్ని పత్రికలు పనిగట్టుకుని గాలి వార్తలు రాస్తున్నాయని, ఇవన్నీ ప్రజలను గందరగోళ పర్చేందుకే అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అంచనాలకు తగ్గట్టుగా బడ్జెట్‌ను రూపొందించుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన ఇబ్బందులను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని తేల్చిచెప్పారు. ఇప్పుడే పునాది రాళ్లు వేస్తున్నాం. ఏదీ ఆదరా బాదరగా చేయొద్దన్నదే తమ లక్ష్యమన్నారు. కరీంనగర్ పర్యటనలో ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ విపక్షాలు అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని హితవు చేశారు. చీప్‌లిక్కర్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విూ కాలంలో వర్థిల్లిన గుడుంబాను అరికట్టడానికే చీప్ లిక్కర్ అని సీఎం పేర్కొన్నారు. గుడుంబాతో కుటుంబాలే ఛిద్రమవుతున్నాయి. గుడుంబా ఎట్ల పోవాలో ఒక్క నాయకుడు సలహా ఇవ్వడు కానీ ధర్నాలు, ఆందోళనలు చేస్తరని ధ్వజమెత్తారు. గుడుంబా విషవలయాన్ని ఛేదించడానికే చీప్ లిక్కర్ అని ఉద్ఘాటించారు. చీప్ లిక్కర్ వల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టమని అధికారులు చెప్పినా తప్పదని ముందుకు పోవాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించినా ప్రజల కోసమే చీప్‌లిక్కర్ తెస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా నూతనంగా ఏర్పడిన రాష్ట్ర అభివృద్ధి కోసమేనని తేల్చిచెప్పారు. కేజీ టూ పీజీ విద్య ఆషామాషీ వ్యవహారం కాదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేజీ టూ పీజీ విద్యావిధానంపై గట్టి కసరత్తు చేస్తున్నామని ఉద్ఘాటించారు. కేజీ టూ పీజీలో సీబీఎస్‌ఈ సిలబస్‌తో పాటు ఇంగ్లీష్ విూడియంలో బోధన జరుగుతుందన్నారు. ఈ విద్యా విధానాన్ని తప్పనిసరిగా తీసుకోస్తాం.. కాకపోతే కొంత సమయం పడుతోంది. కేజీ టూ పీజీ విద్యావిధానంలో ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకే ముందుగా గురుకుల పాఠశాలల్లో ఈ విధానం అమలు చేయాలని చూస్తున్నామని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఇరిగేషన్ విషయంలో చాలా భయంకరంగా దగాపడ్డదన్నారు. ప్రాణహితకు మహారాష్ట్ర ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ పాలకులు చేవెళ్లలో కాల్వలు తవ్వించారన్నారు. ప్రాణహిత ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీళ్లు రావు.. పాలమూరు ఎత్తిపోతలతోనే సాధ్యం. ఎవరు అరిచి గీ పెట్టినా రైతుల సంక్షేమమే సర్కార్ లక్ష్యం. రూ. 35 నుంచి 40 వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ పథకం కొనసాగుతుందన్నారు. ఇంటింటికి నల్లా నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగానే తాము నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు కూడా విపక్షాల విమర్శలను నమ్మి మోసపోవద్దన్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో అభివృద్ధి లక్ష్యంగా పనులు చేస్తున్నామని అన్నారు. ముస్లిం మైనార్టీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని, ఇందుకోసం కమిటీ వేవౄమన్నారు. కమిటీ రిపోర్టు రాగానే అధ్యయనంచేసి అమలు చేస్తామన్నారు. అలాగే రాజీవ్ రహదారిపై అక్రమ టోల్ వసూళ్లపై అధ్యయనం చేయాలన ఇకలెక్టర్‌కు సూచించారు. రాజీవ్ రహదారి వంకలను మార్చడానికి 700 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం అయ్యాయని, అయితే ఆ పనులు ఎవరు చేయాలన్నదానిపై ఆలోచన చేస్తున్నామని అన్నారు. త్వరలోనే దీనిపై స్పస్టత వస్తుందన్నారు. విూడియా సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, కెటిఆర్, ఎమ్మెల్యేలు, కలెక్టర్ నీతూప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.