ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నిధుల పెంపు కొరకు కృషి చేస్తాం.ఎంపీపీ గోపాల్,జెడ్పీటీసీ నరసయ్య
నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని ఇక్కడికి వచ్చే రోగులను మర్యాదగా పలకరించి వారి సమస్యలను తెలుసుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్వో హర్షవర్ధన్ అన్నారు.మంగళవారం నాడు నేరేడుచర్ల,పేంచికల్ దీన్నే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా హాస్పటల్ డెవలప్మెంట్ కు వచ్చే నిధులు ప్రస్తుతం ఉన్న ఖర్చులు నిత్య సరిపోవడం లేదని,నిధులు పెంచడం కోసం తమ వంతు కృషి చేస్తామని పాలక వీడు ఎంపీపీ భూక్యా గోపాల్ నాయక్,
నేరేడుచర్ల,పాలక వీడు, జెడ్పీటీసీలు రాపోలు నరసయ్య, మాలోత్ బుజ్జి మోతీలాల్ అన్నారు.పాలకవీడు సబ్ సెంటర్ ను,ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా అప్ గ్రేడ్ చేయాలని ఎంపీపీ,జెడ్పీటీసీ కోరారు.దిర్సించర్ల సబ్ సెంటర్ ను వైద్య సేవలను, పెంచికల్దీన్నే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మార్చాలని జెడ్పీటీసీ రాపోలు నరసయ్య కోరారు.ఈ సందర్బంగా ఆసుపత్రులకు కావాల్సిన సౌకర్యాలు గురించి అవసరమైన సామగ్రి,కొనుగోలు,త్రాగు నీరు,ఇంటర్ నెట్ బిల్, స్టేషనరీ, ఓపి చిట్టిలు,అత్యవసర మందులు గురించి చర్చించి ఆమోదించారు.ఆయా కార్యక్రమంలో,పాలక వీడు ఎంపీపీ భూక్యా గోపాల్,నేరేడుచర్ల పాలక వీడు,జెడ్పీటీసీలు రాపోలు నరసయ్య, మాలోత్ బుజ్జి మోతీలాల్, వైద్యాధికారులు ఎ.నాగయ్య,ఎన్.ధర్మ తేజ,డి. హరికిషన్, హెచ్.ఈ శ్రీనివాస్, పాలక వీడు ఎంపీటీసీ మీసాల ఉపేందర్, పెంచికళ్ దీన్నే ఎంపీటీసీ యల్లబొయిన లింగయ్య, సూపర్వైజర్ శ్యాంసుందర్ రెడ్డి,శ్రీనివాస్,జయమ్మ, వరమ్మ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area