ప్రారంభమైన ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు:-
మిర్యాలగూడ. జనం సాక్షి
ఆగస్టు 14 వరకు అవకాశం :-
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్,ఇంటర్ అడ్మిషన్లు చెన్నై పాలెం ఉన్నత పాఠశాలలో స్వీకరిస్తున్నామని పాఠశాల కోఆర్డినేటర్ లావూరి వెంకన్న నాయక్,సహాయ కోఆర్డినేటర్ మాలోతు దశరథ నాయక్ లు తెలిపారు. పదో తరగతి లోపు చదువును మధ్యలో మానేసిన వారు రికార్డు సీటు,ఆధార్ కార్డు, పాస్ ఫోటో లతో అడ్మిషన్లు పొందవచ్చని, ఇంటర్ అడ్మిషన్ పొందేవారు పదో తరగతి మెమో,టి సి,ఆధార్ కార్డ్,ఫోటోలతో అడ్మిషన్ పొందాలని సూచించారు. వివరాలకు చెన్నై పాలెం ఉన్నత పాఠశాలలో సంప్రదించాలని వారు కోరారు. వివరాలకు 9849573645,8555917912 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని కోరారు.