11 వ రోజు రిలే నిరాహార దీక్షలు
రాజోలి (జనంసాక్షి) : పెద్ద ధన్వాడలో చేపట్టబోయే ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలనీ తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజు పెద్దధన్వాడ గ్రామ ఉన్నత విద్యావంతులు చెందిన మహేష్, లక్ష్మన్న, తిమ్మప్ప, లింగన్న, అంజి, నాగేష్, నర్సింహా, రామన్ గౌడ్ వెంకటేష్ కిరణ్, రాజేంద్ర దీక్షలో కూర్చున్నారు. వీరికి దీక్షలో మద్దత్తుగా పెద్ద ఎత్తున మహిళలు శాంతమ్మ, నాగలక్ష్మి, నరసమ్మ, పావని, గీత, లక్ష్మీ, శంకరమ్మ, వెంకటేశ్వరమ్మ, సరస్వతి, ఇందు, నాగమ్మ, భారతమ్మ, రాధమ్మ, భాగ్యమ్మ, చిన్నదన్వాడ గ్రామ మున్నూరు కాపులు, ముదిరాజ్ సంఘము నాయకులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల ప్రజల ఆరోగ్యాలను ఫణంగా పెట్టి వ్యక్తుల ప్రయోజనాల కోసం ఈ ఇథనాల్ కంపెనీని మొదలుపెట్టాలని చూస్తే సహించేది లేదని అన్నారు. ఇథనాల్ కంపెనీ ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించకున్నా.. మాపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూసినా ఎట్టి పరిస్థితుల్లోనైనా మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం అని వెల్లడించారు. ప్రభుత్వం మా రైతుల అభిప్రాయాలను తీసుకొని కంపెనీ రద్దు చేయాలి. ఇథనాల్ కంపెనీ రద్దయ్యేదాకా మా పోరాటం ఆగదు అని దీక్షలో పాల్గొన్న రైతులు, యువకులు అన్నారు.