ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తివేత

 

– నిండుకుండల‌ జూరాల ప్రాజెక్ట్…

 

గద్వాల రూరల్ జులై 14 (జనంసాక్షి):- గత వారం రోజులు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంతో జూరాలకు భారీగా వరద నీరు..గురువారం సాయంత్రం జూరాల ప్రాజెక్టులోకి వరద నీరు రావడంతో 23 గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి నీటి విడుదల చేశారు.
జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుంది.
జూరాల ప్రాజెక్టు నిండుకుండల నిండుకుంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు కారణంగా వరద నీరు జూరాల ప్రాజెక్టులోకి భారీగా చేరుకుంది. జూరాల ప్రాజెక్టులోకి వరద నీరు ఎక్కువగా చేరడంతో గురువారం నాడు సాయంత్రం 23 గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు జూరాల అధికారులు. జూరాల వాటర్ లెవెల్ ప్రస్తుతం 317 600 ఉండగా, జూరాల ప్రాజెక్టు నుండి దిగువకు ఒక్క లక్ష 13వేలన్నిటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు జూరాల ప్రాజెక్టులోకి ఆల్మట్టి నారాయణపూర్ నుండి 1,40,000 వేల క్యూసెక్కుల నీరు వస్తుంది వరద నీరు ఎక్కువగా చేరడంతో 23 గేట్లను ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి నీటిని వదిలారు. ఇందులో నుండి పౌరవసు బీమా నెట్టెంపాడు వంటి వివిధ కాలాలకు నీటిని విడుదల చేయడం జరుగుతుంది.