ప్రెస్ అకాడమీ చైర్మన్ గా అల్లం నారాయణ పదవి కాలనీ రెండు సంవత్సరాల పాటు పొడగించడం

ప్రెస్ అకాడమీ చైర్మన్ గా అల్లం నారాయణ పదవి కాలనీ రెండు సంవత్సరాల పాటు పొడగించడం తో ఆయన హైదరాబాద్ లోని పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోల్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కు పుష్పగుచ్చ0 అందజేసి శాలువతో సన్మాని0చారు.తెలంగాణ జర్నలిస్టుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న అకాడమీ చైర్మన్ కు ఆందోల్ ప్రెస్ క్లబ్ వారు అభినందనలు తెలిపారు. ప్రభుత్వానికి జర్నలిస్టులకు వారధిగా పనిచేస్తూ జర్నలిస్టుల సంక్షేమ0 కోసం మరింతగా కృషిచేస్తానని ఛైర్మన్ అల్లం నారాయణ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంజో అధ్యక్షులు ప్రదీప్ గౌడ్, కార్యదర్శి జంగం శ్రీనివాస్, కోశాధికారి కాశీనాథ్, దళిత బంధు జర్నలిస్టు అధ్యక్షుడు సంజీవ్ కుమార్, మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భగత్, జర్నలిస్టులు నర్సింలు మధు, ఉమాశంకర్, మన్నే రాజు, అనిల్ చారి తదితరులు పాల్గొన్నారు.