ప్లాస్టిక్ అమ్మకాలపై కొరడా
కరీంనగర్,జనవరి23(జనంసాక్షి): ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్న ప్లాస్టిక్‌పై సమర భేరి మోగించేందుకు నగర పాలక సంస్థ నడుం బిగించింది. చాలాకాలంగా కూడా వేచి చూసే ధోరణితో ఉన్నప్పటికీ ఎంతకీ వ్యాపారుల్లో మార్పు రాకపోయే సరికి కార్యక్షేత్రంలోకి దిగారు. ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువులు అమ్ముతున్న దుఖాణాలపై నేరుగా దాడులు నిర్వహిస్తున్నారు. భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారు. దాడులు చేస్తే తమ వ్యాపారాలు సాగవని ఆదుకోవాలని నెత్తీ నోరు బాదుకుంటూ బ్రతిమాలారు. అయితే నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని అన్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగే అతి తక్కువ మైక్రాన్లు కలిగిన మట్లిలో కరిగిపోలేని కవర్లను ఖచ్చితంగా నిషేధం విదించడమే అవుతుందని చెప్పినట్లు సమాచారం.