ఫిల్మ్ భవన్ లో నేడు వజ్రోత్సవ చిత్రం ”దేవదాసు” ప్రదర్శన:
కరీంనగర్, జూలై 14(జనంసాక్షి): సరిగ్గా 60 సంవత్సరాల క్రితం విడుదలై వజ్రోత్సవం జరుపుకుంటున్న ”దేవదాసు” చిత్రాన్ని నేడు సాయంత్రం 6.00 గంటలకు స్థానిక ఫిల్మ్ భవన్లో ప్రదర్శించనున్నట్లు కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రావికంటి మురళి, సయ్యద్ ముజఫ్ఫర్‌లు తెలియచేసారు. ఫిల్మ్ భవన్ లో ప్రదర్శిస్తున్న ఈ చిత్రాన్ని సొసైటీ సభ్యులే కాకుండా సినిమా అభిమానులందరూ చూడవచ్చునని సోసైటీ ప్రకటించింది.