ఫెయిర్‌ఫ్యాక్స్‌ విూడియా టీమ్‌లో కోహ్లీ

సిడ్నీ, జనవరి 1: గత ఏడాది అద్భుతంగా రాణిం చిన భారత యువ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఫెయిర్‌ ఫ్యాక్స్‌ విూడియా టీమ్‌లో చోటు దక్కించు కున్నాడు. ఆస్టేల్రియాకు చెందిన విూడియా సంస్థ లు ఎంపిక చేసే ఈ టీమ్‌లో భారత్‌ నుండి కోహ్లీ ఒక్కడే చోటు సాధించాడు. సిడ్నీ మార్నింహ్‌ హెరాల్డ్‌ కథనం ప్రకారం కమర్షియల్‌గానూ, ఆటపరంగానూ ముందంజ ఉన్న కోహ్లీ ఎంపిక య్యాడని తెలుస్తోంది. అలాగే సౌతాఫ్రికా క్రికెటర్‌ డుప్లెస్సిస్‌ కూడా ఈ టీమ్‌కు ఎంపికయ్యాడు. ఇటీవల ఆసీస్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో అతను నిలకడగా రాణించాడు. అటు గత ఏడాది ఒక ప్లేయర్‌కు కూడా చోటు దక్కని ఆస్టేల్రియా నుండి  సారి ముగ్గురికి అవకాశం లభించింది. కెరీర్‌లో సూపర్‌ ఫామ్‌తో దూసుకెళుతోన్న మైకేల్‌ క్లార్క్‌తో పాటు మైక్‌ హస్సీ, పీటర్‌ సిడెల్‌ ఎంపికయ్యారు. బ్యాటింగ్‌లో అలెస్టర్‌ కుక్‌, హషీమ్‌ ఆమ్లా, జాక్‌ కల్లిస్‌ చోటు దక్కించుకున్నారు. బౌలింగ్‌లో సౌతాఫ్రికా పేసర్‌ వెర్నార్‌ ఫిలాండర్‌, డేల్‌ స్టెయిన్‌, జివ్మిూ ఆండర్సన్‌, గ్రేమ్‌ స్వాన్‌లు ఎంపికయ్యారు. 12వ ఆటగాడిగా రంగన హెరాత్‌, కీపర్‌గా మాట్‌ ప్రియర్‌లకు ఓటు పడింది.

ఫెయిర్‌ఫ్యాక్స్‌ విూడియా టీమ్‌ 2012 ః

మైకేల్‌ క్లార్క్‌, హషీమ్‌ ఆమ్లా, విరాట్‌ కోహ్లీ, అలెస్టర్‌ కుక్‌, జాక్‌ కల్లిస్‌, డుప్లెసిస్‌, మ్యాట్‌ ప్రియర్‌, డేల్‌ స్టెయిన్‌, ఫిలాండర్‌, జివ్మిూ ఆండర్సన్‌, గ్రేమ్‌ స్వాన్‌, రంగన హెరాత్‌