ఫోన్ ట్యాపింగ్ కేసులో .. నేడు కేసీఆర్‌ను విచారించనున్న సిట్

` చట్టబద్ధంగా వ్యవహరించలేదు: కేసీఆర్
` సుప్రీం మార్గదర్శకాలు ఉల్లంఘించిన పోలీసులు
` నందినగర్ ఇంటికి నోటీసులు ఎలా అతికిస్తారు?
` అయినా ఏసీపీ స్థాయి అధికారికి నన్ను విచారించే అధికారం లేదు
` ఎర్రవెల్లిలో అందుబాటులో ఉంటానని చెప్పాను
` నేరుగా నోటీసులు ఇవ్వకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు
` జూబ్లీహిల్స్ ఏసీపీకి మాజీ సీఎం కేసీఆర్ లేఖ
` నేటి విచారణకు అందుబాటులో ఉంటానని వెల్లడి
హైదరాబాద్,జనవరి31(జనంసాక్షి):జూబ్లీహిల్స్ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదని మాజీ సిఎం కేసీఆర్ పేర్కొన్నారు. నోటీసుల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి మాజీ సీఎం, బీఆరఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ఆరు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. కైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణను ఈ లేఖలో వివరించారు. ముఖ్యంగా నందినగర్ నివాసం గోడపై నోటీసు అతికించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని కేసీఆర్ స్పష్టం చేశారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను.. వారి నివాసం వద్దే విచారించాలని చట్టం చెబుతోందని గుర్తు చేశారు. తాను ప్రస్తుతం ఎర్రవల్లి నివాసంలో ఉంటున్నానని, అక్కడే విచారణ జరపాలని పోలీసులకు స్పష్టంగా తెలిపారు. ఈ సందర్భంగా సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ కేసు తీర్పును లేఖలో ఉటంకించారు. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న చిరునామాకు, సీఆర్పీసీ సెక్షన్ 160 కింద జారీ చేసే నోటీసులకు ఎలాంటి సంబంధం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నివసిస్తున్న చిరునామాలోనే విచారణ జరపాలని పార్లమెంట్ చట్టం స్పష్టంగా చెబుతోందని తెలిపారు. హరీష్ రావుకు జారీ చేసిన నోటీసుల విషయంలో పోలీసులు వేర్వేరు ప్రమాణాలు పాటిస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. ఈ తరహా చర్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని హెచ్చరించారు. పోలీసుల తీరు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బాధ్యతాయుతమైన పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు పూర్తి సహకారం అందిస్తానని కేసీఆర్ వెల్లడించారు. ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నందినగర్ నివాసంలోనే విచారణకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. అక్రమ పద్ధతిలో జారీ చేసిన నోటీసులను విస్మరించే హక్కు తనకు ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తనకు సంబంధించిన నోటీసులన్నీ ఎర్రవల్లి చిరునామాకే పంపాలని పోలీసులకు సూచించారు. అలాగే ఏపీ హైకోర్టులోని వీడీ మూర్తి కేసు తీర్పును కూడా లేఖలో ప్రస్తావించారు. చట్టపరమైన అభ్యంతరాలున్నా తాను విచారణలో సిట్‌కు సహకరిస్తానని చెప్పారు. సిట్ పోలీసుల వైఖరి కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని తెలిపారు. పోలీసుల తీరు నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉందని వెల్లడించారు. కేసీఆర్ లేఖలో ఏం రాశారంటే.. ’సిట్ అధికారులు వ్యవహరించిన తీరు చట్టాలకి వ్యతిరేకం. సుప్రీంకోర్టు తీర్పులను తుంగలో తొక్కిన సిట్ అధికారుల తీరు. సిట్ అధికారులకి నోటీసు ఇచ్చే అధికారమే లేదు. ఇది నా రాజ్యాంగ హక్కులను కాలరాయడమే. మొన్న రెండుసార్లు సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులు చట్టవిరుద్ధం, చట్టాలను అతిక్రమించి ఇచ్చారు. విÖరు ఇచ్చిన మొదటి నోటీసుకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండటంవల్ల వేరే రోజు విచారణకు తేదీ ఇవ్వాలని చెప్పాను. దాంతోపాటు 65 ఏళ్ల పైబడిన వ్యక్తులను వారు నివసించే చోటనే విచారించాలని చెప్పే సెక్షన్ 160 అసఖఅ నిబంధనలను విÖ దష్టికి తెచ్చాను’ అని పేర్కొన్నారు. ’తదుపరి నోటీసులన్నీ కూడా ఎర్రవల్లిలోని నా నివాసానికే పంపాలని చెప్పాను. కానీ, ఇది చెప్పిన తర్వాత కూడా గుర్తుతెలియని వ్యక్తులు విÖ సంతకంతో ఉన్న లేఖను రాత్రి 9 గంటలకు నందినగర్ నివాసంలోని మా ఇంటి గోడకు అతికించినట్లు తెలుస్తోంది. ఆ లేఖ విÖరే పంపినట్లయితే, విÖ సూచనల మేరకే అతికించినట్లయితే, ఆ లేఖను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను. ఇది భారత రాజ్యాంగం, చట్టం, గౌరవ సుప్రీంకోర్టుల పట్ల విÖకు ఏమాత్రం గౌరవం లేదు అనే విషయాన్ని సూచిస్తుంది. గతంలో సుప్రీంకోర్టు ’సతేంద్ర కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ’ అనే కేసులో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వాట్సాప్ లేదా ఇతర ఎలక్టానిక్ మార్గాల ద్వారా నోటీసులు పంపడం చట్టబద్ధమైన పద్ధతి కాదని, చట్టం నిర్దేశిరచిన రీతిలోనే నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. నోటీసులను వ్యక్తిగతంగా అందజేయాలి. కానీ విÖరు కావాలనే చట్టాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది’ అని కేసీఆర్ తన లేఖలో సూచించారు.’భవిష్యత్తు నోటీసులన్నీ ఎర్రవల్లికే పంపాలని చెప్పినప్పటికీ విÖరు దాన్ని విస్మరించారు. కాబట్టి విÖరు ఇచ్చిన రెండో నోటీసు చట్టబద్ధంగా అందలేదు, అది చెల్లదు. విÖరు ఇచ్చిన నోటీసు నా రాజ్యాంగబద్ధ హక్కులను ఉల్లంఘించడమే. నేను విÖ పోలీస్ స్టేషన్ పరిధిలోగానీ, పొరుగు పోలీస్ స్టేషన్ పరిధిలోగానీ నివసించడం లేదు. కాబట్టి విÖకు నోటీసు ఇచ్చే అధికార పరిధి లేదు. ఈ నోటీసుతో నన్ను కట్టడి చేసే అధికారం లేదు. ఎలక్షన్ అఫిడవిట్‌లో, అసెంబ్లీ రికార్డులో ఉన్న అడ్రస్ ఆధారంగా ఎర్రవల్లిలో విచారించలేమని విÖరు చెప్పడం సరికాదు. నోటీసు ఇచ్చే సమయానికి వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నారు అన్నదే ముఖ్యం. నేను కొన్ని సంవత్సరాలుగా ఎర్రవల్లిలో నివసిస్తున్నాను అన్నది నిర్వివాద అంశం. అక్కడే నా స్టేట్‌మెంట్ రికార్డ్ చేయవలసిన బాధ్యత విÖపై ఉన్నది’ అని పేర్కొన్నారు.


