బతుకమ్మలు ఎక్కడ నిమజ్జనం చేయాలి సారు
రామారెడ్డి సెప్టెంబర్ 29 ( జనం సాక్షి) :
బతుకమ్మలు ఎక్కడ నిమజ్జనం చేయాలి సారు అని మోషన్ పూర్ నాయకులు ప్రశ్నించారు. పత్రిక ముఖంగా గ్రామ నాయకుడు దత్తాద్రి మాట్లాడుతూ, గ్రామానికి చెందిన చెరువును పూడికతీత లో బాగంగ ( మీషన్ కాకతీయ ) 2017-18 కింద దాదాపు కోటి రుపాయాలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇట్టి విషయాన్ని పలు మార్లు ఎంపీటీసీ ఉమాదేవీ మండల పరిషత్తు సమావేశంలో, ప్రభుత్వ అధికారులను నిలదీశారు. అయిన ఇరిగేషన్, సంబందీత అధికారులు తప్పించుకొని బడ నాయకుల అండతో దర్జాగా ఉంటున్నారని అన్నారు. ప్రతి చెరువునకు కనిసం తెలంగాణ కీర్తి బతుకమ్మ పండుగ కోసం మెట్లు కట్టించాలని కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ మిషన్ కాకతీయ కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి దాదాపు 98 శాతం బిల్లులు దండుకున్నారని ఆరోపించారు.ఇరిగేషన్ అధికారులు ( త్రిపాత్రాభినయం) నటిస్తున్నారని మండిపడ్డారు. ఓవైపు డబ్బులకు కకృతి పడి ,మరో వైపు నాయకులకు అండగా ఉండడం ,మరోకోణం ఉద్యగులకు సహయం , ఇవన్ని ఇరిగేషన్ అధికారులు చేస్తున్న పనులని అన్నారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో తిలోదకాలు తిష్టవేశినయని అన్నారు. ఇంత దరిద్రంగా ఏ డిపార్ట్ మెంట్ లో లేదన్నారు. వారు ఎందుకోసం ఉద్యగం చేస్తున్నారో కలెక్టర్ సారుకు ఉన్నతాధికారులకు తెలిసి ఉండవచ్చని అభివర్ణించారు. ప్రజల పన్నులను ప్రభుత్వం వసులు చేసీ ప్రజలకు చెందాలిసిన నిధులు కాంట్రాక్టర్లు మింగెస్తున్నారని అన్నారు. మిషన్ కాకతీయ పనులపై రామారెడ్డి మండలంలోని అన్ని గ్రామాల్లో నిధులు గురించి కలెక్టర్ స్వయంగా బహిరంగ సభ నిర్వహించి తెలుపాలని డిమాండ్ చేశారు. నాసిరకం మొరంతో కట్ట వెయించారని , అట్టి చెరువు కట్ట చీలిపోయి వేల ఎకరాల పంటలు నశనం అయ్యే విధంగా దాపురించిందన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ తో పాటు జిల్లా ఉన్నతాధి కారులు మోషంపూర్ గ్రామంతో పాటు మండలం లోని అన్ని గ్రామాల్లో మిషన్ కాకతీయ పనుల పై ఆరతీసీ బటండారం బయట పెట్టాలని కోరారు