బతుకమ్మ పండుగ తెలంగాణ జాతికి మాత్రమే సొంతం

ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 23 ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ జాతికి మాత్రమే సొంతమని అలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం, జిల్లా పరిషత్ చైర్మన్ సరిత లు హాజరై మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపడుచులు అందరూ కలిసి జరుపుకునే బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా ఉండాలనే ఉద్దేశ్యతోనే సీఎం కేసీఆర్ మహిళలకి చీరల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వం ఏటా అందజేస్తున్న బతుకమ్మ కానుక చరిత్రాత్మకమని వారు అన్నారు. టీఆర్‌యస్ పాలనలోనే మహిళలకు సముచిత గౌరవం దక్కిందన్నారు.మహిళల అభ్యున్నతికి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్నేహ, ఎంపీటీసీ వెంకటేశ్వరమ్మ, జెడ్పిటిసి హనుమంత్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ ఇ. రంగారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, తహసిల్దార్ సుబ్రహ్మణ్యం, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళలు పాల్గొన్నారు.