బసంత్‌నగర్ కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుని దుర్మరణం
రామగుండం: మండలంలోని బసంత్‌నగర్ కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న గుండారపు ఓదేలు అనే కాంట్రాక్ట్ కార్మికుడు 30మీటర్ల క్రేనుపై నుండి దిగుతుండగా జారీపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అక్కడి కాంట్రాక్ట్ కార్మికులు ఆరవై లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆఫీస్‌లోకి చోచ్చుకువెళ్లడానికి యత్నించారు. దీంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. యాజమాన్యం మాత్రం 8లక్షలు ఇచ్చేందుకు సుముకంగా ఉన్నట్లు సమాచారం.