బస్టాండ్ వద్ద నిలిచిపోయిన నీటిని తొలగింపు

మున్సిపల్ కమిషనర్ తీరుపై కౌన్సిలర్ల ఆగ్రహం
(జనంసాక్షి) జులై 12 : నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చేర్యాల కొత్త బస్టాండ్ జలమయంగా మారింది. సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బందితో కలిసి బస్టాండ్ వద్ద నిలిచిపోయిన వర్షపు నీటిని జేసీబీ సహాయంతో కంధకం తీయించి తొలగించారు. పట్టణంలో అందుబాటులో ఉండాలని అధికారులు సూచించినా కమిషనర్ తీరు మాత్రం మారడం లేదని, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కమిషనర్ ను వెంటనే బదిలీ చేయాలని టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి, కౌన్సిలర్ పచ్ఛిమడ్ల సతీష్ గౌడ్ వాట్సప్ లో సిద్దిపేట జిల్లా ఆడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్ రాజేంద్రకుమార్ విధులకు ఆలస్యంగా హాజరై పని చేసినట్లుగా పోటో దిగి వాట్సప్ లో పెట్టారని విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న కమిషనర్ తీరుపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వెంట వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, కౌన్సిలర్లు ఉడుముల ఇన్నమ్మ-భాస్కర్ రెడ్డి, సందుల సురేష్, మున్సిపల్ మేనేజర్ జె. ప్రభాకర్, కంప్యూటర్ ఆపరేటర్ వెంకట్, ప్రియతమ్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.