బస్సును ఢీకొన్న బందోబస్తు వాహనం: 9మంది పోలీసులకు గాయాలు
కరీంగనర్,మే10(జనం సాక్షి): జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సును పోలీస్ వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో 9 మంది పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మానకొండూరు మండలం చెంజెర్ల వద్ద ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన బందోబస్తు నుంచి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సవిూప ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేశారు.