బస్సు ప్రమాదంలో చనిపోయిన ఐదుగురి గుర్తింపు

కరీంనగర్‌,మే29(జ‌నం సాక్షి): కరీంనగర్‌  జిల్లాలోని మానకొండూరు మండలం చంజర్ల వద్ద జరగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులు కొందరిని గుర్తించారు. ఈ ప్రమాదంలో  ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాద స్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాలను గుర్తించారు.  ఇందులో మానకొండూర్‌ మండలం ముంజంపల్లికి చెందిన  పిల్లి లక్ష్మీ (60),జమ్మికుంటకు చెందిన కాంట్రాక్టు లెక్చరర్‌  గుండా హరిప్రసాద్‌ (35),హైదరాబాద్‌ ముషీరాబాద్‌కు చెందిన జకీర్‌ అహ్మద్‌, హన్మకొండ గోపాల్‌ పూర్‌ కాలనీకి చెందిన  రాయబారపు సుభాషిణి, గీసుకొండ మండలం ఎల్కుర్తి హవేలికి చెందిన నాగరాజు (28) ఉన్నారు. మరో ఇద్దరు మృతులను గుర్తించాల్సి ఉందని అధికరాఉలు తెలిపారు.