బస్సు బోల్తా.. 8 మందికి గాయాలు
మహబూబ్‌నగర్: బెంగళూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు బస్సు మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. వీరిని వనపర్తి ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.