బహుళ జాతి సంస్థల రాకతో 4 కోట్ల మందికి ఉపాధి కరవు
పెబ్బేరు: చిల్లర వ్యాపారం లోకి బహుళజాతి సంస్థల రాక వలన దేశంలో 4 కోట్ల మందికి ఉపాధి కరవవుతుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు రాంచంద్రన్ పిళ్లే, సుధా సుందరరామన్‌లు చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం దక్షిణ భారతదేశం నుంచి ప్రారంభమైన సీపీఎం జీపుజాత పెబ్బేరు చేరింది. ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఎం నాయకులు ప్రసంగించారు.