బాత్రూం లు లెట్రిన్స్ లేక విద్యార్థుల ఇక్కట్లు
భూపాలపల్లి (ప్రతినిధి)ఆగస్టు 18 జనం సాక్షి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లోని కస్తూర్బా విద్యాలయం లో దాదాపు 200 పై బడిన విద్యార్థుల ఉండగా వారికి సరైన ఈ విధంగా బాత్రూము లు లెట్రిన్ లు సరిగ్గా లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు వారు తెలిపారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని తక్షణమే బాత్రూంల లెట్రిన్లు వెంటనే నిర్మించాలని వారు కోరారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం మూలంగా ఉదయం వేళల్లో స్నానపు గదులు సరిగ్గా లేక విద్యార్థులు వాటర్ ట్యాంకుల వద్ద స్నానాలు చేయుచున్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి విద్యార్థులకు సరిపడే విధంగా లెట్రిన్ బాత్రూమ్ ల వెంటనే ఏర్పాటు చేయాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. కస్తూర్బా విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ లావణ్య సంబంధిత అధికారులతో మాట్లాడి విద్యార్థులకు సరిపడే విధంగా గా లెట్రిన్ బాత్రూమ్ ల నిర్మాణాలు చేపట్టాలని విద్యార్థులు కోరారు.