బాధిత కుటుంబానికి 20 వేలు అందజేత

శివ్వంపేట అక్టోబర్ 23 జనంసాక్షి : మండల పరిధిలోని గూడూరు గ్రామానికి చెందిన తీగల నర్సమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.  తన అనుచరుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న కేహెచ్ ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లూరి హనుమంతరావు ఆదివారం ఎదుల్లాపూర్ సర్పంచ్ కల్లూరి కీర్తన హనుమంతరావు తో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, మృతురాలి బంధువు జెల్లా శ్రీనివాస్ కు నర్సమ్మ అంత్యక్రియల కోసం 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కల్లూరి హనుమంతరావు మాట్లాడుతూ భవిష్యత్తులో తమ ట్రస్టు ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృత పరుస్తామని కేహెచ్ఆర్ స్పష్టం చేశారు.