బాబూ జగ్జీవన్‌రామ్‌కు సీఎం కేసీఆర్‌ ఘననివాళి

c

ఆయన స్ఫూర్తితో సర్కారు ముందుకు

హైదరాబాద్‌,ఏప్రిల్‌5(జనంసాక్షి): బాబూ జగ్జీవన్‌ రాం జయంతి వేడుకలు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ బషీర్‌ బాగ్‌ లోని జగ్జీవన్‌ రాం విగ్రహానికి సీఎం కేసీఆర్‌ పూలమాల వేసి, నివాళులు అర్పించారు. . దళిత జాతి ఉద్ధరణకు బాబు జగ్జీవన్‌రామ్‌ అహర్నిశలు కృషి చేశారని కేసీఆర్‌ కొని ఆడారు. ఆయన చూపిన బాట యావజ్జాతికి ఆదర్శమన్నారు. దేశంలో ఉన్న అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని, దేశ ఉపప్రధానిగా ఆయన చేసిన సేవలు శ్లాఘనీయమన్నారు. కేంద్రంలో ఆయన దేశానికి దిశానిర్దేశం చేస్తూ మార్గదర్శకంగా నిలిచారని, అదే స్ఫూర్తితో తెలంగాణ సర్కారు పనిచేస్తుందన్నారు. తెలంగాణలో దళితులకు 3 ఎకరాల భూపంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఇది భూమిలేని నిరుపేద దళికతులకు ఓ వరమన్నారు. రాష్ట్ర సర్కారు ఉప ముఖ్యమంత్రి పదవిని దలితుడికే ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అన్ని వర్గాలతో సమానంగా అణగారిన వర్గాలు తలెత్తుకునేలా తమ సర్కారు కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. జగ్జీవన్‌రామ్‌ ఆశయాన్ని కొనసాగించటమే ఆయనకు మనమర్పించే ప్రధాన నివాళిగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్‌, పద్మారావు, సాంస్కృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి తదితర నేతలు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు