బాల్క సుమన్‌ ప్రతిష్ట దెబ్బతీసేలా దుష్పచ్రారం

కేసులు నమోదు చేశామన్న సిఐ

మంచిర్యాల,జూలై6(జ‌నం సాక్షి): పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌పై అసత్య ప్రచారం చేస్తూ ఆయన ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిపై కేసు నమోదు చేశామని మంచిర్యాల సీఐ మహేష్‌ తెలిపారు. సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతున్న లైంగిక వేధింపుల ఘటన అవాస్తవమన్నారు. ఎంపీని ట్రాప్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేసి లబ్దిపొందాలని ఎంపీ కుటుంబ సభ్యుల ఫొటోను మార్పింగ్‌ చేసి ఆన్‌ లైన్‌ లో సర్కిలేట్‌ చేస్తున్నారని సీఐ మహేష్‌ వెల్లడించారు. బాధితులుగా చెప్పుకుంటోన్న బోయిన సంధ్య, విజితలపై 2018 ఫిబ్రవరి 6న కేసు నమోదు చేశామని చెప్పారు. ప్రస్తుతం బంజారాహిల్స్‌ లోనూ కేసులు నమోదయ్యాయి అని అన్నారు. ఇద్దరు నిందితులు పలువురిని బ్లాక్‌ మెయిల్‌ చేసి వేధించినట్టుగా మా విచారణలో తేలిందని సీఐ మహేష్‌ స్పష్టం చేశారు. వీరిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 420,292ఎ, 419,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

—-