బిజెపి ప్రచార వాహనం ప్రారంభం
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 19(జనం సాక్షి)
నియంతృత్వ, అవినీతి, కుటుంబ పాలన విముక్తి కోసం తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత లో భాగంగా ఈ నెల ఆగస్ట్ 26న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగే పాదయాత్ర వాడ వాడన ప్రచారం కోసం వరంగల్ తూర్పు నియోజకవర్గ బిజెపి నాయకులు గంట రవికుమార్ ఏర్పాటు చేసిన ప్రజా సంగ్రామ యాత్ర ప్రచార వాహనాన్ని శుక్రవారం వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ కొండేటి శ్రీధర్ బిజెపి సీనియర్ నాయకులు మాజీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ వంగాల సమ్మిరెడ్డి మరియు వరంగల్ జిల్లా యాత్ర ప్రముఖ్ మళ్లాడి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.