*బిజేపి సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలి!

*ఎల్లారెడ్డి అసెంబ్లి ఇంచార్జ్ బాణాల
_________________________
లింగంపేట్ 18 ఆగస్టు (జనంసాక్షి)
ఈనెల 21న చౌటుప్పల్ లో జరిగే బిజెపి భారీ బహిరంగ సన్నాహక సభను విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి నియోజకవర్గ అసెంబ్లి ఇంచార్జ్ బాణాల లక్ష్మారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఆయన గురువారం లింగంపేట్ మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన బిజెపి సమావేశంలో పాల్గొని మాట్లాడారు.ఈ నెల 21న చౌటుప్పల్ లో జరిగే సన్నాహక సభకు కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరౌతరన్నారు.ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి బిజెపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సన్నాహక సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బాపురెడ్డి,బిజెపి రాష్ట్ర నాయకులు మర్రి రామ్ రెడ్డి,లింగంపేట్ మండల అధ్యక్షుడు దత్తు రాములు,బిజెపి జిల్లా,మండల నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.