బీజేపీ నాయకుడు ఖాజన్నగౌడ్ హత్య
మహబూబ్‌నగర్,(జనంసాక్షి): జిల్లాలోని కొందుర్గుకు చెందిన బీజేపీ గీత కార్మిక సంఘం నాయకుడు ఖాజన్న గౌడ్(38) దారుణ హత్యకు గురయ్యారు. బైక్‌పై వెళ్తున్న అతన్ని గుర్తు తెలియని దుండగులు కొందర్గు మండలం ఉత్తరాసిపల్లి సమీపంలో అడ్డగించారు. టాటా సుమో వాహనంపై ఖజన్నగౌడ్ కాడ్నాప్ చేసిన దుండగులు బైరంపల్లి సమీపంలో తీసుకెళ్లి దారుణంగా కొట్టి వదిలేశారు. స్థానికులు ఖజన్నను షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.