బీసీ బాలుర హాస్టల్ ప్రారంభించిన ఎంపీ పొన్నం
రామడుగు జూలై 21 (జనంసాక్షి) : మండలంలోని వెదిర గ్రామంలో బీసీ బాలుర హాస్టల్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యమ్రానికి ముఖ్య అతిథిలుగా కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య హాజరయ్యారు. చొప్పదండి నియోజక వర్గంలోని ఇంటర్ నుంచి పీజీ వరకు చదివే బీసీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా బీసీ వేల్పేర్ ఆఫీసర్ మంజుల, కరీంనగర్ డివిజన్ బీసీ వేల్పేర్ ఆఫీసర్ సరోజ తెలిపారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ పొన్న ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అంజనీ ప్రసాద్, రామడుగు జడ్పీటీసీ మురళీ కృష్ణ, బాలగౌడ్, కాడె శంకర్ తదితరులు పాల్గొన్నారు.