*బీసీ మహిళా అధ్యక్షురాలిగా పెద్దేముల్ వైస్ ఎంపీపీ *

 

పెద్దేముల్ సెప్టెంబర్ 21 (జనం సాక్షి)
వికారాబాద్ జిల్లా బీసీ సంఘం మహిళ అధ్యక్షురాలుగా కందనెల్లి ఎంపీటీసీ,పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారిని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య,బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి చేతులమీదుగా నియామక పత్రం అందచేశారు.ఈ సందర్భంగా వైస్ ఎంపిపి మధులత మాట్లాడుతూ… వికారాబాద్ జిల్లా బిసి మహిళ అధ్యక్షురాలిగా ఎన్నుకునందుకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయస్థాయిలో బీసీ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకుర్, వికారాబాద్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు యాదగిరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.