బూస్టర్ డోస్ టీకా అవసరమే
జడ్పీ సీఈఓ శోభారాణి
మహదేవపూర్ సెప్టెంబర్ 20 (జనంసాక్షి)
మహాదేవపూర్ మండల కేంద్రంలో జయశంకర్ భూపాలపల్లి జడ్పీ సీఈఓ శోభారాణి పర్యటించారు.మన ఊరు మన బడి పనుల పురోగతిని పరిశీలించిన తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీపతిబాపు ఆధ్వర్యంలో వాడల్లో కొనసాగుతున్న మొబైల్ బూస్టర్ డోస్ టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు.రెండు డోస్ ల టీకా పూర్తయిన వారు బూస్టర్ డోస్ టీకా తప్పనిసరిగా వేసుకోవాలని,టీకా లపై అపోహలు వద్దని,శరీరానికి రోగ నిరోధక శక్తి నిచ్చేందుకు టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలని,టీకాల పట్ల నిర్లక్ష్యం చేస్తే.మన ఆరోగ్యానికి హాని చేసినట్లు అన్నారు.ప్రభుత్వం నుండి ఉచితంగా అందించే టీకాలను హక్కుగా పొందడం పౌరుడిగా మన బాధ్యత అని సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బి రాణి బాయి, ఎంపీడీఓ శంకర్ నాయక్,గ్రామ కార్యదర్శి రజినీకాంత్ రెడ్డి, ఏఈ రవీందర్,హెచ్ ఈ ఓ స్వామి,ఏ ఎన్ ఎం లు,ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు
Attachments area