బైండోవర్ ఉల్లoఘన…నల్ల బెల్లం వ్యాపారికి లక్ష జరిమానా

వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ సీఐ బిక్షపతి,ఎస్సై జయశ్రీ

కేసముద్రం ఆగస్టు22 జనం సాక్షి / మండలం లోని లాలు తండాలోని గుగులోతు సురేష్ అనే వ్యక్తి బైండోవర్ నియమాల ఉల్లంఘన చేసినందుకుగాను ఒక లక్ష జరిమానా చెల్లించడం జరిగింది. వివరాలలోకి వెళ్తే కేసముద్రం మండలంలోని లాలు తండా వాస్తవ్యులు గుగులోతు సురేష్ ను నాటుసారా,నల్లబెల్లం అమ్మకుండా రవాణా చేయకుండా కేసముద్రం తహసిల్డార్ ముందు మే 06- 2022 నాడు బైండోవర్ చేయడం జరిగింది.బైండోవర్ నియమాలను ఉల్లంఘిస్తూ సదరు గుగులోతు సురేష్ నాటు సారాయికి నల్లబెల్లం అమ్ముతూ గూడూర్ ఎక్సైజ్ అధికారులకు తేదీ జూన్22- 2022 నాడు పట్టుబడినాడు.
బైండోవర్ నియమాల ఉల్లంఘన కింద సదరు గుగులోతు సురేష్ ను తహసిల్దార్ ఫరీదుద్దీన్ ముందు ప్రవేశ పెట్టగా ఒక లక్ష రూపాయలు జరిమానా విధించడం జరిగింది.ఈ సందర్భంగా గూడూరు ఎక్సైజ్ సీఐ బిక్షపతి మాట్లాడుతూ నాటు సారాయి తయారి దారులు ,రవాణా దారులు,నల్లబెల్లం, పట్టిక అమ్మకం దారులను అందరిని తాసిల్దారుల ముందు బైండోవర్ చేస్తున్నామని బైండోవర్ నియమాల్ని ఉల్లంఘించినట్లు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై జయశ్రీ, కానిస్టేబుల్లు సుధాకర్, యుగేందర్, దేవేందర్ లు పాల్గొన్నారు.