బొగ్గు రవాణా ను అడ్డగించిన కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ — –స్తంభించిన బొగ్గు రవాణా లారీ, ట్రిప్పర్లు

కే ఓసి లో భారీగా మోహరించిన పోలీసులు

టేకులపల్లి, సెప్టెంబర్ 25( జనం సాక్షి ): సింగరేణి కాంట్రాక్టు కార్మికులు గత 17 రోజులుగా తమ సమస్యలపై చేస్తున్న నిరవేదిక సమ్మెలో భాగంగా రాష్ట్ర కమిటీ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా ఆదివారం కోయగూడెం ఓపెన్ కాస్ట్ నుండి బొగ్గు రవాణాను జేఏసీ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. దీంతో బొగ్గు రవాణా చేసే లారీ ట్రిప్పర్లు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు కార్మికులు సమ్మె చేస్తున్న కోయగూడెం ఓసి వద్దకు పోలీసులు భారీగా చేరుకోవడంతో పోలీసులు కార్మికుల మధ్య అదుపు చేసే ప్రయత్నంలో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు డి ప్రసాద్ , అయిత శ్రీరాములు, కడుదుల వీరన్న, కోటిలింగం ,మారుతీ రావు, ప్రతాప్ తదితరులు జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల న్యాయ సమ్మతమైన సమస్యలను సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత 17 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకపోవడం సోషనీయమన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సమస్యలపై పోరాడడం సిగ్గుచేటు అన్నారు. ఏ ఆశయం కోసం సకల జనులు తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాధించుకున్నారో అది నేడు శాపంగా మారిందని అన్నారు. త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో కాంట్రాక్టు కార్మికులు చాలీచాలనీ వేతనాలతో విధులు నిర్వహించడం ఇది టిఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా రేపు జరిగిపోయే చర్చల్లో సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం సమ్మె నివారించాలని దానికోసం తగు చర్యలు తీసుకోవాలని, కార్మికులకు వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నరసింహారావు,కుంజా రమేష్, చిట్టిబాబు,రవి,సురేందర్ ,రా