బోయివాడ ప్రాంతంలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్

నిర్మల్ పట్టణం లోని శాస్త్రీనగర్,బోయివాడ ప్రాంతంలో మంగళవారం మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్  పర్యటించి,కాలినడకన బోయివాడ ప్రాంతం నుండి శాస్త్రినగర్  వరకు తిరుగుతూ ,శాస్త్రీనగర్ నందు గత 20 సంవత్సరాలుగా మురికినీటి నాళాల, శానిటేషన్ సమస్యను కాలనీ వాసులు తెలియచేయటంతోమురికి నీటి నాళాల్లో పేరుకుపోయిన చెత్త,చెదారం పిచ్చి మొక్కలు, వంటివి తొలగించే ప్రకియా పనులు,చేయించారు,.ఈ సందర్భంగా కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు.అక్కడక్కడ కాలనీ రోడ్డు లో స్పీడ్ బ్రేకర్స్,వంటివి తొలగింపు ప్రకియా పనులు,పరిశీలించారురాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి  కృషి, సహకారంతో, రానున్న రోజుల్లో పట్టణ వార్డుల్లో మురికినీటి నాళాలు,మరియు సి.సి రోడ్డు మార్గం ఏర్పాటు శాశ్వత పరిష్కారం చేస్తాం అన్నారు. స్థానిక కౌన్సిలర్ శంకర్ పతి,సానిటరీ ఇన్స్పెక్టర్ దేవిదాస్,కిషన్ రావు,డాక్టర్ సతీష్,విఠల్ రావు,రాజేశ్వర్ రెడ్డి,గంగారెడ్డి,భూషణ్,అంజ గౌడ్,మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు