బ్రహ్మాండంగా సాగుతున్న  రైతుబంధు

రైతుల ముఖంలో ఎన్నడూ లేని ఆనందం
వ్యవసాయం ఇక పండగే అన్న తుల ఉమ
కరీంనగర్‌,మే12(జ‌నం సాక్షి): జిల్లాలో రైతుబంధు పథకం బ్రహ్మాండంగా కొనసాగుతోందని, దసరా పండగ ముందే వచ్చినట్లుగా ఉందని జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ పేర్కొన్నారు. ఇంతటి ఆనందం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రతిరైతు ముఖంలో ఆనందం తొణికిసలాడుతోందన్నారు. గ్రామా/-లో ఎక్కడకి పోయినా ఇదే చర్చ సాగుతోందని అన్నారు. రైతులు పంటల సాగుకోసం అప్పులు చేసి ఆర్థికంగా దివాలా తీస్తున్నారనీ, రైతులను అప్పుల నుంచి గట్టెక్కించాలని ఎకరానికి రూ. 4 వేలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ కావడంతో నిరంతరం రైతుల, బడుగుబలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు.అన్నదాతల్లో ఆనందం నింపాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెట్టిందని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు.  పలు గ్రామాల్లో అధికారులు రైతుబంధు పథకాన్ని ప్రారంభించడంతో రైతులు ఆనందంగా ఉన్నారని అన్నారు. రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ రైతు బంధు పథకం ప్రవేశపెట్టారనీ అంటూ, రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి
దేశంలోనే ఏ రాష్ట్రంలో లేరని అన్నారు. పెట్టని రైతు బంధు పథకం ప్రవేశ పెట్టి, కింద రైతుకు ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ 8 వేలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని తుల ఉమ అన్నారు.   తెలంగాణ రాష్ట్రం రాకముందు గల్ఫ్‌బాట పట్టిన రైతులు, వారి కష్టాలు తెలిసి రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో రైతు బంధు పథకం ప్రవేశపెట్టారనీ తెలిపారు. రైతులు వ్యవసాయ సాగుకు వడ్డీకి రుణాలు తీసుకోకుండా శాశ్వత పరిష్కారం ముఖ్యమంత్రి చూపారని పేర్కోన్నారు. ఇకనుంచి వారు ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకునే రోజులు వచ్చాయని అన్నారు.