బ్రిడ్జిపై నుంచి కాల్వలో పడ్డ లారీ

ప్రమాదంలో ఇద్దరు మృతి

జగిత్యాల,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. బ్రిడ్జిపై ఉన్న గుంతను తప్పించబోయిన లారీ.. అదుపుతప్పి వరద కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదే బ్రిడ్జిపై ఏడాది క్రితమూ గుంతను తప్పింబోయి రెండు లారీలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. గుంతను పూడ్చకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద నివారణలో అధికారులు విఫలమయ్యారని అన్నారు.