భక్తి శ్రద్ధలతో “సీత్లా” పండుగ వేడుకలు

, జులై 12, జనంసాక్షి:
గిరిజనులైన లంబాడీలు వారి సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ “సీత్లా భవానీ” పండుగ. ఈ పండుగ బంజారాల ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. ప్రతి ఏటా పంటలను సాగు చేసే సమయంలో ముందుగా సీత్లా భవానీ దేవతకు గిరిజనులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సంస్కృతి తరాలుగా బంజారాలకు సొంతం. మండల పరిధిలోని మాచినేనిపేటతండా, గుండ్లరేవు, గుండెపుడి, గంగారంతండా, గాంధీనగర్ పలు గిరిజన గ్రామాల్లో సీత్లా పండుగ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తండాల సరిహద్దుల్లోని పొలిమేర, కూడళ్ల వద్ద సీత్లా భవాని దేవతను ప్రతిష్టించారు. డప్పు వాయిద్యాలతో పురుషులు, మహిళలు, యువతులు దేవత వద్దకు ప్రదర్శనగా వెళ్లి నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారికి కోళ్లు మేకలను బలిహరణ ఇచ్చారు. పాడిపంటలు సమృద్ధిగా కలగాలని, సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నారు. సీత్లా పండుగ సందర్భంగా తండాల్లో మహిళలు, యువతులు చేసిన సాంప్రదాయ నృత్యాలు అలరించాయి