భక్తుల వద్దకు వెళుతున్న రాజన్న ప్రచార రథయాత్ర
వేములవాడ, జూన్-26, : పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వా మికి సంబంధించిన ప్రచారంతో పాటు హిందూ ధార్మిక ప్రచారం నిర్వహించడానికి ఏర్పాటు చేసిన రాజన్న ప్రచార రథయాత్ర రెండో విడత బుధవారం నుండి ప్రారంభమవుతున్నట్లు ఆలయ ఈ.ఓ. అప్పారావు పేర్కొన్నారు. దేవాదాయ ధర్మా దాయశాఖ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్‌తో పాటు, వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవసా ్థనం వారి అధ్వర్యంలో బుధవారం నుండి వచ్చే నెల 6 వ తేదీ వరకు కరీంనగరజిల్లాలోని వివిధ గ్రామాలకు వెళ్ళడానికి రెండో విడత ప్రచారం చేయనున్నట్లు అప్పారావు తెలిపారు. బుధవారం నాడు రాజన్న ఆలయం ముందు శ్రీరాజరాజేశ్వ రస్వామి వారలకు పూజలు నిర్వహించిన అనం తరం బయలుదేరే ఈ ప్రచార రథం వేములవాడ మండలంలోని మర్రిపెల్లి మీదుగా చందుర్తి మండలంలోని మర్రిగడ్డ, చందుర్తి, మల్యాల, లింగంపేట, కట్టలింగంపేట నుండి రుద్రంగి గ్రామానికి చేరుకుని అక్కడి శ్రీలక్ష్మినరసింహ స్వామి దేవస్థానంలో బసచేస్తారు. తిరిగి గురువా రం నాడు రుద్రంగి నుండి బయలుదేరి కథలా పూర్ మండలంలోని కలికోట, అంబారిపేట, పోసానిపేట, ధూంపేట, తాండ్య్రాల, సిరికొండ, కథలాపూర్, ఎకీన్‌పూర్ గ్రామాల నుండి కోరుట్ల పట్టణానికి చేరుకొని అక్కడి శ్రీసాయిరాం దేవాల యంలో బసచేస్తారు. శుక్రవారం నాడు పట్టణం లోని వివిధ వీధుల్లో ధార్మిక ప్రచారం, రాజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శనివారం నాడు కోరుట్ల నుండి బయలుదేరి మెట్‌పెల్లికి చేరుకునే ఈ ప్రచార రథం ద్వారా పట్టణంలో ఊరేగింపు నిర్వహించి అక్కడే బసచేస్తారు. తిరిగి ఆదివారం నాడు ప్రాతఃకాల పూజ అనంతరం మెట్‌పెల్లి నుండి బయలుదేరి వెంకట్రావుపేట, అమ్మక్కపేట, ఇబ్రహీంపట్నం మీదుగా గోదూర్ చేరుకొని అక్కడి శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించి రాత్రి అక్కడే బస చేస్తారు. సోమవారం గోదూర్ నుండి బయలుదేరే ఈ ప్రచార రథం మెట్‌పెల్లి మండలంలోని వేంపేట, ముత్యంపేట, సిర్‌పూర్, కోస్తాపూర్, మీదుగా మల్లాపూర్ మండల కేంద్రానికి చేరుకుని అక్కడి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బసచే స్తారు. 3వ తేదీ మంగళవారం నాడు మల్లాపూర్ నుండి గర్రెపెల్లి, రేగుట్ట, ఇటిక్యాల మీదుగా రాయికల్ మండల కేంద్రానికి చేరుకుంటుంది. తిరిగి బుధవారం రాయికల్ నుండి మేడిపెల్లి మండలంలోని మైతాపూర్, కట్లకుంట, మేడిపెల్లి, తాటిపెల్లి, వెంకట్రావుపేట చేరుకుని అక్కడి శ్రీవేం కటేశ్వరస్వామి దేవాలయంలో బసచేస్తారు. గురువారం నాడు వెంకట్రావుపేట నుండి తాటి పెల్లి, అంతర్గాం గ్రామాల మీదుగా ఈ రథయా త్ర జగిత్యాల చేరుకుని పట్టణంలోని వివిధ వార్డులలో ఊరేగింపు నిర్వహించి ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. షెడ్యూల్ చివరి రోజైన శుక్రవారం రోజున జగిత్యాల నుండి ఈ ప్రచార రథం బయ లుదేరి పెంబట్ల, సారంగాపూర్, బీర్‌పూర్, దన్నూర్, దొంతాపూర్ గ్రామాల మీదుగా ధర్మపురి పుణ్యక్షేత్రానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రెండో విడత ప్రచార కార్యక్రమం పూర్తిచేయనున్నట్లు వేములవాడ దేవ స్థానం ఈ.ఓ. తుళ్ళూరు అప్పారావు తెలిపారు.