భారతదేశంలో సువర్ణాధ్యాయం

రైతుబందు పథకానికి శ్రీకారం చుట్టిన సిఎం కెసిఆర్‌
పెట్టుబడి పథకంతో రైతులకు అండగా సర్కార్‌
12వేల కోట్ల నిధులు కేటాయింపు
నిరంతర విద్యుత్‌, ప్రాజెక్టులతో తెలంగాణ వ్యవసాయానికి భరోసా
సెంటిమెంట్‌ జిల్లాగా కరీంనగర్‌ నుంచే ప్రారంభం
కాంగ్రెస్‌ మాటలతో ఆగం కావద్దని హెచ్చరిక
కరీంనగర్‌,మే10(జ‌నం సాక్షి):  తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు చెక్కులపంపిణీ, పాస్‌ పుస్తకాల పంపిణీ అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం  ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల విూదుగా ప్రారంభం అయ్యింది. కరీంనగర్‌లో జిల్లా హుజారాబాద్‌ మండలం ఇందిరానగర్‌లో సిఎం కెసిఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు. వివిధ జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ కరీంనగర్‌ జిల్లా అంటే తనకు సెంటిమెంట్‌ అని.. అందుకే కరీంనగర్‌ నుంచి ఏ పని మొదలు పెట్టినా విజయం సాధిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. ఇందిరానగర్‌లో రైతు బంధు పథకాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నామని చెప్పుకొచ్చారు. పోరాటంలో అండగా నిలిచిన జిల్లా కరీంనగరేనన్నారు. సివిల్స్‌లో నెం.1గా నిలిచిన అనుదీప్‌ కరీంనగర్‌ వాసేనని.. తెలంగాణ తెలివి ఏంటో నిరూపించాడని కొనియాడారు. అన్నివర్గాల ప్రజలకు నిరంతర విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని గుర్తుచేశారు. భూ ప్రక్షాళన చేసిన ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణనేనన్నారు. అంతేకాకుండా 20శాతం సొంత ఆదాయం సాధించిన రాష్ట్రం కూడా తెలంగాణనేనని చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాలు  పదిశాతం లోపే ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో ఉద్యోగులందరూ విశేష కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ¬ంగార్డులకు, ఆశావర్కర్లకు, అంగన్‌వాడీలకు అత్యధిక జీతాలు ఇస్తున్నామని వెల్లడించారు. భారతదేశంలో ఇవాళ పర్వదినమని చెప్పుకొచ్చారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలోనే ఇవాళ సువర్ణ అధ్యాయమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం చేసిన గౌరవం తెలంగాణకే దక్కిందన్నారు. రైతులకు ఇచ్చే డబ్బు బ్యాంక్‌లో ఉంది.  /ూనాకాలం పంట పెట్టుబడి కోసం రైతులకు ఇచ్చే డబ్బు రూ.6 వేల కోట్లు బ్యాంకులో ఉన్నాయని సీఎం చెప్పారు. పాస్‌బుక్కులు, చెక్కులు అందించడానికి కృషి చేసిన అధికారులకు సీఎం కృతజ్ఞతలు తెలియజేశారు. రైతు పెట్టుబడి కోసం 12 వేల కోట్ల రూపాయలు కేటాయించాం. పెట్టుబడి సహాయం సద్వినియోగం చేసుకుని బంగారు పంటలు పండించాలని రైతులను కోరారు. వ్యవసాయం బాగుండాలంటే భూముండాలి..నీళ్లుండాలి..కరెంట్‌ ఉండాలి. భూ రికార్డులను ప్రక్షాళన చేసినం, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నం. ఈ సంవత్సరం నుంచి పంట పెట్టుబడి కూడా అందజేస్తున్నామని తెలిపారు. నేడు యావత్‌దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలుస్తుందన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన విజయవంతంగా పూర్తి చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ అధికారులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. బంగారు పంటలను పండించాలని రైతులను కోరుతున్నట్లు స్పష్టం చేశారు. రైతులకు పెట్టుబడి సాయం చేసిన గౌరవం తెలంగాణకు దక్కుతుందన్నారు. మద్దతు ధర కోసం ఎంపీలు కేంద్రంతో పోరాడతారని కేసీఆర్‌ తెలిపారు.  జాతీయ ఉపాధి హావిూ పథకాన్ని
వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్‌ రైతు బంధు పథకం వేదిక నుంచి కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. కూలీలకు ఇచ్చే డబ్బును సగం కేంద్ర ప్రభుత్వం భరించాలి..సగం రైతు భరించాలని కేంద్రానికి సూచించారు. కేంద్రం అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలని సీఎం డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ వాళ్ల మాటలు వింటే ఆగమవుతరు. ఆంధ్రా నాయకుల తొత్తులుగా ఉండి టీ కాంగ్రెస్‌ నేతలు వ్యవసాయాన్ని నాశనం చేశారని సీఎం విమర్శించారు. తెలంగాణకు కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఒక్కరూపాయి కూడా ఇవ్వనంటే ఒక్క నేత కూడా కిక్కురుమనలేదు. ఆనాడు నోరు మూసుకున్న నాయకులు నేడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు వద్దు అంటున్నరో కాంగ్రెస్‌ నేతలు చెప్పాలని సీఎం ప్రశ్నించారు. కాళేశ్వరం నీళ్లతో మూడు పంటలు పండించుకోబోతున్నం. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే కోటి ఎకరాలకు సాగునీరందుతుందన్నారు.
కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ కెసిఆర్‌   ప్రవేశపెట్టిన పంట పెట్టుబడి పథకం దేశానికే ఆదర్శమని  అన్నారు. రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఈటల మాట్లాడుతూ..రైతు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని స్పష్టం చేశారు. ప్రజాహిత కార్యక్రమాలతో సీఎం కేసీఆర్‌ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లాను వాటర్‌హబ్‌గా తీర్చిదిద్దారని అన్నారు. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలతో ప్లలెలన్నీ బాగుపడ్డాయని..ఇంకా బాగుపడాల్సిన అవసరముందని ఈటల అభిప్రాయపడ్డారు. తెచ్చుకున్న తెలంగాణలో అబివృద్ది కార్యక్రమాలను అమలు చ ఏసుకుంటున్నామని అన్నారు. తెలంగాణ ఏర్పడితే ఏమొస్తదని అంటున్నవారు దీనికి సమాధానం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపి వినోద్‌, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపిలు, అధికారులు పాల్గొన్నారు.
———–