భారత్‌లో పెట్టుబడులకు విదేశీ సంస్థల ఆసక్తి – వెంకయ్యనాయుడు

C

స్మార్ట్‌ సిటీలకు తెలంగాణ అనుకూలం – కేటీఆర్‌

హైదరాబాద్‌ ఆగస్ట్‌22(జనంసాక్షి):

ప్రధాని మోడీ విధానాలు నచ్చి పెట్టుబడులకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచ మార్కెట్లు భారత్‌ వైపు చూస్తున్నాయన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకు వస్తున్నాయని వివరించారు. భారత్‌లో చేపట్టిన సంస్కరణలు పెట్టుబడులకు దోహదం చేస్తున్నాయన్నారు. 24 గంటలు విద్యుత్‌ అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. వ్యర్థ పదార్థాల నుంచి విద్యుత్‌ తయారీకి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.  హైదరాబాద్‌ హైటెక్స్‌లో జాతీయ ఆకర్షణీయ నగరాలపై సదస్సు జరిగింది. హైటెక్‌సిటీ నోవాటెల్‌ ¬టల్‌లో స్మార్ట్‌సిటీస్‌పై జరిగిన సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. వంద ఆకర్షణీయ నగరాలు కేవలం ప్రారంభం మాత్రమేనన్నారు. దేశంలోని పట్టణాలు, గ్రామాలు కూడా ఆకర్షణీయం కావాలని కాంక్షించారు. ప్రశాంతంగా జీవించే నగరమే ఆకర్షణీయ నగరం అన్నది తమ భావన అని వెల్లడించారు. ఆకర్షణీయ నగరాల ఎంపిక పక్రియ ఈ నెలాఖరుతో ముగుస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా  కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2030 నాటికి 75 శాతం జీడీపీని సాధిస్తామని ఉద్ఘాటించారు. గతేడాది కాలంలో 25 వేల పాఠశాలల్లో టాయిలెట్స్‌ నిర్మించాం. వచ్చే ఏడాదిలో మరో 25 వేల పాఠశాలల్లో టాయిలెట్స్‌ నిర్మిస్తామన్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి స్మార్ట్‌సిటీస్‌ కాన్సెప్ట్‌ అమలు చేస్తున్నామని ప్రకటించారు. ప్రపంచ మార్కెట్‌లు భారత్‌ వైపు చూస్తున్నాయని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో స్మార్ట్‌సిటీల నిర్మాణం వేగవంతంగా జరుగుతుందన్నారు. 24 గంటల విద్యుత్‌ అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. వ్యర్థ పదార్ధాల నుంచి విద్యుత్‌ తయారీకి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఉద్ఘాటించారు. పన్నులు పెంచగలిగితేనే పంచగలుగుతామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. పన్నులు పెంచకుంటే పంచె మిగులుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశ ఆదాయంలో 50 శాతం పట్టణాల నుంచి వస్తుందని, పట్టణాభివృద్ధి చెందితే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. స్మార్ట్‌సిటీ ఎంపికలో రాజకీయ ప్రమేయం ఉండదన్నారు. సొంత ఆదాయం సమకూర్చుకుంటేనే పట్టణప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వెంకయ్య అన్నారు.  స్వచ్ఛ భారత్‌, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం కేంద్రం రాష్టాన్రికి నిధులు విడుదల చేసింది. రాష్టాన్రికి రూ. 29 కోట్లు నిధులను విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. నిధుల ఉత్తర్వు ప్రతిని మంత్రి కేటీఆర్‌కు వెంకయ్య అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ…. సాంకేతిక వ్లిపవం వచ్చిన తర్వాత అభివృద్ధి వేగవంతమైందన్నారు. దేశంలో యువత ఎక్కువగా ఉన్నారు…యువతకు నైపుణ్యాలను అందిస్తే మంచి అభివృద్ధి సాధించవచ్చన్నారు. తెలంగాణలో మౌళికవసతులకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఇంటింటికి వాటర్‌ గ్రిడ్‌ ద్వారా సేఫ్‌ వాటర్‌ అందించే ప్రయత్నం జరుగుతోందన్నారు. అలాగే ఇటీవల చేపట్టిన అనేకకార్యక్రమానలు ప్రస్తావించారు. అంతేగాకుండా పెట్టుబడులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నామని  అన్నారు.