భారత్‌లో పెట్టుబడులు పెట్టండి
– మేక్ ఇన్ ఇండియాలో ప్రధాని మోదీ
బెంగుళూరు, అక్టోబర్6(జనంసాక్షి):
పెట్టుబడి దారులకు భారత్ ఎంతో అనుకూలమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. గత పదిహేను నెలలుగా భారత్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పాటు చేశమాన్నారు. . జర్మనీ ఛాన్సెలర్ ఏంజెల్ మెర్కెల్ కలిసి బెంగళూరులోని భాష్ ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని సందర్శించారు. బెంగళూరులో మంగళవారం ఉదయం ప్రధాని మోడీ, జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ పర్యటించారు. పర్యటనలో భాగంగా బాష్ ప్రధాన కార్యాలయాన్ని వీరిద్దరూ సందర్శించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. పెట్టుబడులకు భారత్ ఎంతో అనుకూలమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ… భారత్-జర్మనీ ఆర్థిక భాగస్వామ్యం ఎంతో బలమైందన్నారు. తయారీ రంగాన్ని ప్రోత్సహించాలనే మేక్ ఇన్ ఇండియా చేపట్టామన్నారు. అలాగే పరిశ్రమలకు వేగవంతంగా అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలు, వ్యాపారవేత్తలకు అనుకూల నిర్ణయాలు తీసకున్నామన్నారు. రైల్వేల్లో వందశాతం ఎఫ్‌డీఐలను ప్రవేశపెట్టామని, రక్షణశాఖలో 49శాతం ఎఫ్‌డీఐలకు అనుమతించామన్నారు. స్పెక్ట్రమ్ వేలం, కేటాయింపులు పారదర్శకంగా జరిగాయని వెల్లడించారు. వస్తు, సేవల పన్ను బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాని, 2016 నాటికి వస్తు, సేవల పన్ను బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేంద్ర న్యాయశాఖమంత్రి సదానందగౌడ తదితరులు పాల్గొన్నారు.