భారత్ గెలువు పట్ల విజయోత్సవ సంబరాలు..

ఊరుకొండ, అక్టోబర్ 23 (జనంసాక్షి):
టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఉత్కంఠ భరితంగా సాగిన హోరాహోరీ పోరులో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆదివారం ఊరుకొండ మండల కేంద్రంలో ఊరుకొండ యూత్ ఆధ్వర్యంలో బాణసంచాలు పేల్చి ఘనంగావిజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఊరుకొండ యూత్ ఆది, సందీప్, సంతోష్, హరీష్, చిరు, అశోక్, శ్రీశైలం బాలుకృష్ణ, అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు.